Asianet News TeluguAsianet News Telugu

Hit2 Ott Rights : ప్రముఖ ఓటీటీ సంస్థకు ‘హిట్ 2’ స్ట్రీమింగ్ రైట్స్.. డిటేయిల్స్!

యంగ్ హీరో అడివి శేష్ నటించిన ‘హిట్ 2’ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ క్రమంలో ఓటీటీ రిలీజ్  పైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది.  ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ మూవీ రైట్స్ ను దక్కించుకున్నట్టు తెలుస్తోంది. 
 

Popular OTT company bagged Hit 2 movie streaming rights!
Author
First Published Dec 2, 2022, 10:49 AM IST

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా, అడివి శేష్ హీరోగా నటించిన చిత్రం ‘హిట్ : ది సెకండ్ కేస్’ (Hit 2). శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈరోజు (డిసెంబరు 2న) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే యూఎస్ ఏలో ప్రీమియర్స్ పడగా పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకులను మెప్పించడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా ఉందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నారు. 

థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా దక్కించుకున్నట్టు తెలుస్తోంది.  ‘హిట్ : ది  ఫస్ట్ కేస్’ కూడా అమెజాన్ లోనే స్ట్రీమింగ్ అయిన  విషయం తెలిసిందే.  అయితే ఫస్ట్ కేసు కంటే సెంకడ్ కేసుపై భారీ అంచనాలు నెలకొనడంతో.. ఫస్ట్ డే టాక్ ను బట్టి భారీ  ధరకు విక్రయించనున్నట్టు  తెలుస్తోంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోనే ఓటీటీ రైట్స్ దక్కించుకున్నట్టు సమాచారం. దీనికిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సింది. 

ఇప్పటికే అడివి శేష్ ‘మేజర్’తో నార్త్ లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు. ప్రస్తుతం ‘హిట్ 2’ను  కూడా హిందీలో రిలీజ్ చేస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్లు రాబట్టనుంది. దీంతో ఓటీటీలోకి ఈ చిత్రం రావడం కాస్తా ఆలస్యమనే తెలుస్తోంది. లాంగ్ రన్ లో ‘హిట్ 2’ థియేటర్లలో సందడి చేయనుందని అంటున్నారు. 
వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నిర్మించిన ఈ చిత్రాన్ని నాని సమర్పిస్తున్నారు. హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటించింది. రావు రమేష్, కోమలి ప్రసాద్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Follow Us:
Download App:
  • android
  • ios