నటి కీర్తి సురేష్ తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. 'మహానటి'తో ఆమె ఫాలోయింగ్ మరింతగా పెరిగింది. రీసెంట్ గా ఆమె చెన్నైలో ఖరీదైన ఫ్లాట్ కొనుక్కుంది.

ఆమెకి వస్తోన్న అవకాశాలు, రెమ్యునరేషన్ చూసుకుంటే ఆమె ఇల్లు కొనడం పెద్ద విషయమేమీ కాదు. కానీ కీర్తికి ఫ్లాట్ కొనిచ్చింది ఓ అగ్ర హీరో అనే వార్త కోలివుడ్ లో చక్కర్లు కొడుతోంది. సదరు హీరోకి తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ కలిసి ఓ సినిమా కూడా చేశారు.

ఆ బంధంతోనే కీర్తికి ఫ్లాట్ ని బహుమానంగా ఇచ్చినట్లు చెన్నై మీడియావర్గాలు కథనాలు ప్రచురిస్తున్నాయి. ఈ హీరో గతంలో కూడా ఓ హీరోయిన్ కి ఇలానే ఫ్లాట్ గిఫ్ట్ గా ఇచ్చాడట. అప్పట్లో కూడా ఆ వార్త బాగానే చక్కర్లు కొట్టింది. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఏదైనా ఖరీదైన ఇల్లు, కారు కొనుక్కుంటే ఇలానే ఎవరో గిఫ్ట్ చేశారంటూ వార్తలు రావడం కామన్ అయిపోయింది.

రాశిఖన్నా, రకుల్, కేథరిన్ వంటి నటీమణుల విషయంలో కూడా ఇలాంటి గాసిప్సే వినిపించాయి. అయితే అందులో నిజం లేదని తన కష్టార్జితంతో ఇల్లు తీసుకున్నామని సదరు నటీమణులు క్లారిటీ ఇవ్వడంతో ఆ వార్తలు తగ్గాయి. మరి కీర్తి సురేష్ ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి!