Asianet News TeluguAsianet News Telugu

పాపులర్ తెలుగు విలన్ మృతి,ఆర్దిక కారణాలే..?

తొంబైవ దశకంలో తెలుగు, హిందీ భాషల్లో  విలన్‌గా బాగా పాపులర్‌ అయిన బాలీవుడ్‌ నటుడు మహేశ్‌ ఆనంద్‌ మృతి చెందారు. ముంబైలోని ఆయన ప్లాట్ లో శవంగా పడి ఉన్నారు. 57 సంవత్సరాల వయస్సు ఉన్న ఆయన మృతికి కారణాలు తెలియరాలేదు. ఆయన శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కూపర్ హాస్పటిల్ కు తీసుకెళ్లారు. 

Popular '90s actor Mahesh Anand passes away
Author
Hyderabad, First Published Feb 10, 2019, 11:07 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

తొంబైవ దశకంలో తెలుగు, హిందీ భాషల్లో  విలన్‌గా బాగా పాపులర్‌ అయిన బాలీవుడ్‌ నటుడు మహేశ్‌ ఆనంద్‌ మృతి చెందారు. ముంబైలోని ఆయన ప్లాట్ లో శవంగా పడి ఉన్నారు. 57 సంవత్సరాల వయస్సు ఉన్న ఆయన మృతికి కారణాలు తెలియరాలేదు. ఆయన శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కూపర్ హాస్పటిల్ కు తీసుకెళ్లారు. 

తెలుగులో ఆయన  సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి  తీసిన ‘నంబర్‌ వన్‌’ సినిమాలో విలన్  గా నటించా రాయన. ఆ సినిమాలో శ శాడిస్ట్ పాత్రకు బాగా పేరు వచ్చింది. ఆ తర్వాత తెలుగులోనూ బాగానే ఆఫర్స్ వచ్చాయి. కానీ బాలీవుడ్ వైపు ఆయన వెళ్లిపోయారు.  హిందీలోనూ ‘శెహన్‌షా, మజ్‌బూర్, స్వర్గ్, తనీదార్, విజేత, కురుక్షేత్ర’ వంటి సినిమాల్లో విలన్‌గా మెప్పించారు మహేష్. 

2002లో భార్యకు విడాకులు ఇచ్చినప్పటి నుంచి ముంబైలో మహేష్  ఒంటరిగానే ఉంటున్నారు. ఈ ఏడాది రిలీజైన గోవిందా చిత్రం ‘రంగీలా రాజా’ చిత్రంతో 18 ఏళ్ల తర్వాత సినిమాలకు రీ ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఆర్దిక ఇబ్బందులతో బాధపడ్డారని బాలీవుడ్ మీడియా అంటోంది. 

చివరగా ఆయన ఇచ్చిన ఇంటర్వూలో ... ‘‘18 ఏళ్లుగా ఎవ్వరూ నాకు సినిమా ఆఫర్‌ చేయలేదు. పని, డబ్బు లేకుండా ఇన్నేళ్లు ఒంటరిగా బతికాను. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వ్యక్తులతో పని చేశాను. కానీ నన్ను ఎవ్వరూ గుర్తుపెట్టుకోలేదు’’ ఆవేదనగా అన్నారు మహేష్.   

Follow Us:
Download App:
  • android
  • ios