Poorna: రాత్రి గర్భంతో వర్షంలో షూటింగ్.. భయానక పరిస్థితులు వెల్లడించిన `ఢీ` పూర్ణ
హీరోయిన్ పూర్ణ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకుని పూర్ణ.. నటిగా బిజీ అవుతుంది. ఓ వైపు `ఢీ` షో చేస్తూ, మరోవైపు సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటుంది. అయితే ఆమె తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది.

నటి పూర్ణ.. ఒకప్పుడు హీరోయిన్‌గా మెప్పించింది. హాట్ హీరోయిన్‌గా అలరించింది. `అవును` లాంటి సినిమాలతో అటు అందంతోనూ, ఇటు హర్రర్ ఎలిమెంట్లతోనూ మెప్పించింది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్‌గా సక్సెస్ కాలేకపోయినా నటిగా మాత్రం పూర్ణ మంచి మార్కులే వేసుకుంటుంది. ఇప్పుడు కీలక పాత్రలతో మెప్పిస్తుంది. ఇటీవల ఆమె `దసరా`, `అఖండ` వంటి చిత్రాల్లో నటించింది. `దసరా`లో విలన్‌కి భార్యగా కనిపించింది. సినిమా చివర్లో మెరిసింది. అయితే ఆ సమయంలో గర్భంతో ఉందట. అంతేకాదు ఆయా సీన్లు చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డానని పేర్కొంది పూర్ణ.
తాజాగా పూర్ణ ఓ వీడియో ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకుంది. `దసరా` సినిమా షూటింగ్ సమయంలో తాను గర్బవతిగా ఉన్నానని, వర్షంలో షూటింగ్ చేయాల్సి వచ్చిందని, అది కూడా రాత్రి సమయంలో షూటింగ్ చేసినట్టు చెప్పింది. అయితే వర్షంలో రాత్రి సమయంలో పైగా గర్భంతో ఉన్నప్పుడు షూటింగ్ చేశారని, కానీ ఆ సమయంలో తాను చాలా ఇబ్బంది పడినట్టు వెల్లడించింది.
చల్లటి నీళ్లు వాడాల్సి రావడంతో హెల్త్ పరంగా రెండు రోజులపాటు ఇబ్బంది పడిందట. పైగా తనపై సీన్లు ఎక్కువగా రాత్రి సమయంలోనే ఉన్నాయని, చలిలో ఆయా సీన్లు చేయడం కష్టంగా అనిపించిందని చెప్పింది. గర్భవతిగా ఉన్న తాను చల్లటి నీళ్లు వాడటం వల్ల మరింత సమస్యలు తెచ్చిపెట్టిందని చెప్పింది. అంత కష్టపడి చేస్తే తీరా ఎడిటింగ్‌లో తన సీన్లని తీసేశారని పేర్కొంది పూర్ణ. అంతగా పడ్డ కష్టం వేస్ట్ అయ్యిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
తాను వర్షంలో తడవడం వల్ల ఇబ్బంది పడటాన్ని గమనించిన మేకర్స్ వేడినీళ్లు తెప్పించి తనపై పోస్తూనే ఉన్నారని చెప్పింది. అంతేకాదు మరో సంఘటన కూడా షేర్ చేసుకుంది. సినిమాలో మరో సన్నివేశం కోసం రాత్రి పూట నిర్మానుష్యమైన రోడ్డుపై పరిగెత్తాల్సి వచ్చిందని, అప్పుడు వీధి కుక్కల అరుపులు విని భయపడ్డానని, కానీ అదృష్టవశాత్తు అవి తనని కరవలేదని చెప్పుకొచ్చింది. ఆయా సీన్లలో కాళ్లకి చెప్పులు కూడా లేకుండా షూట్ చేశారని వెల్లడించింది. ఆ సమయంలో టీమ్ ఎంతో సహకరించిందని చెప్పింది పూర్ణ.
పూర్ణ.. దుబాయి బేస్డ్ వ్యాపార వేత్త షానిద్ అసిఫ్ అలీని గతేడాది వివాహం చేసుకుంది. వీరికి ఇటీవల పండంటి మగబిడ్డ జన్మించారు. తన కుమారుడు జన్మించిన కొన్ని రోజులకే మళ్లీ యదావిధిగా సినిమాలు, టీవీ షోస్‌తో బిజీగా మారింది పూర్ణ. ఇక నాని హీరోగా శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో `దసరా` రూపొందింది. మార్చిలో ఈ చిత్రం విడుదలైంది. మంచి విజయాన్ని అందుకుంది.