బాలయ్య సినిమా గురించిన ఈ న్యూస్ జనాలకు షాకే
బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయన్స్ కి చోటుంది. ఒక హీరోయిన్ గా మలయాళీ ముద్దుగుమ్మ ప్రయాగ మార్టిన్ ఎంపికైన విషయం తెలిసిందే. రెండో హీరోయిన్ గా పూర్ణ అవకాశాన్ని సొంతం చేసుకుంది.
క్రేజీ కాంబినేషన్ లేకపోతే ఈ రోజున ప్రాజెక్టుని ఎవరూ పట్టించుకోవటం లేదు. దాంతో నిర్మాతలు,దర్శకులు నిరంతరం తమ హీరో సరసన ఎవరిని హీరోయిన్ గా సెట్ చేస్తే బాగుంటుంది..ఎవరిని విలన్ గా పెడదాము అనే లెక్కలు వేసుకుని మరీ ముందుకు వెళ్తున్నారు. తాజాగా బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయన్స్ కి చోటుంది. ఒక హీరోయిన్ గా మలయాళీ ముద్దుగుమ్మ ప్రయాగ మార్టిన్ ఎంపికైన విషయం తెలిసిందే. రెండో హీరోయిన్ గా పూర్ణ అవకాశాన్ని సొంతం చేసుకుంది.
పూర్ణ ఇప్పటివరకు బాలయ్యతో నటించలేదు. అంతేకాదు స్టార్ హీరోతో నటించడం ఆమెకు ఇదే మొదటిసారి. మంచి ఫెరఫార్మర్ అనే పేరున్నా, ఆమె ఖాతాలో చెప్పుకోదగిన హిట్లున్నా ఇంతవరకూ ఆమెకు సరైన ప్రాజెక్ట్ పడలేదు. ఆ లోటు ఇప్పుడు బాలకృష్ణ, బోయపాటిల చిత్రంతో తీరిపోనుందని ఆమె అభిమానులు ఆనందపడుతున్నారు. అసలు బాలయ్య సరసన పూర్ణ నటించబోతోందని ఎవరూ ఊహించలేదు. దాంతో ఈ వార్త బయిటకు లీక్ కాగానే సోషల్ మీడియాలో ఓ రేంజిలో డిస్కషన్స్ షురూ అయ్యాయి.
ఇకరీసెంట్ గా హైదరాబాద్‌లో పునః ప్రారంభమైన ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు యాంగిల్లో సాగే పాత్రలో కనిపిస్తారు. కొన్ని సీన్స్ లో అఘోరాగా ఆయన కనపడ నున్నట్టు సమాచారం. సింహా, లెజండ్ చిత్రాల తరువాత బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్‌లో మూడో మూవీ ఇది. లాక్‌డౌన్‌కి ముందే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా.. ఆ మధ్య బాలయ్య పుట్టినరోజు సందర్భంగా వచ్చిన టీజర్ అభిమానులను చాలా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రం కోసం మరో నందమూరి హీరోని ఎంపిక చేసారని సమాచారం. ఆ హీరో మరెవరో కాదు నందమూరి తారకరత్న అని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయన యంగ్ ఎమ్మల్యే గా కనిపించబోతున్నట్లు చెప్తున్నారు. కొంచెం నెగిటివ్ షేడ్స్ కలిగిన ఈ పాత్ర సినిమాలో హైలెట్ అవుతుందని ,తారకరత్నకు మళ్లీ లైమ్ లైట్ లోకి తెచ్చే పాత్ర అవుతుందని చెప్తున్నారు.
ఇక బిబి3 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతన్న ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారనివినపడుతోంది. మరో ప్రక్క ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, హీరోయిన్ గురించి రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. త్వరలోనే టైటిల్ విషయంలో తుది నిర్ణయం తీసుకుని షూటింగ్ మొదలు అయిన వెంటనే పోస్టర్ లేదా టీజర్ ను విడుదల చేయాలని భావిస్తున్నారట చిత్రయూనిట్ .
ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రామీణ నేపథ్యంలో వచ్చే కొన్ని సీన్స్ ను షూట్ చేయనున్నారు అని సమాచారం. ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నామని బోయపాటి చెప్పిన విషయం తెలిసిందే. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.