ఎప్పటిలాగే టైటిల్ విషయంలో తన మార్క్ చూపించాడు దర్శకుడు పూరి జగన్నాధ్. విజయ్ దేవరకొండతో తాను తెరకెక్కిస్తున్న చిత్రానికి లైగర్ అనే టైగర్ ఫిక్స్ చేశాడు. ఇక ట్యాగ్ లైన్ అయితే మరీ బోల్డ్ గా 'సాలా క్రాస్ బ్రీడ్' అంటూ పెట్టారు. పూరి హీరోలంటే యాటిట్యూడ్ కి కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా ఉంటారు. అలాంటిది విజయ్ లాంటి హీరోని మరింత ఆరగెంట్ అండ్ రఫ్ గా పూరి ప్రెజెంట్ చేస్తాడనిపిస్తుంది. టైటిల్ చూస్తుంటేనే ఈ విషయం ఈజీగా అర్థం అవుతుంది. 

టైగర్ మరియు లయన్ కలయిక వలన పుట్టే కొత్త బ్రీడ్ ని లైగర్ అంటారు.  విజయ్ దేవరకొండ టైగర్ మరియు లయన్ కి పుట్టిన క్రాస్ బ్రీడ్ అన్న అర్థంలో పూరి ఈ టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఉన్నాడు. అలాగే టైగర్, లయన్ కలిస్తే ఎంత డేంజరో... అలాగే ఈ ఫైటర్ కూడా అంతే డేంజర్ అనే మరో అర్థం కూడా ఊహించుకోవచ్చు.  విజయ్ దేవరకొండ ఈ మూవీలో ఫైటర్ గా కనిపించనున్నాడు. 

మొత్తంగా టైటిల్ తోనే పూరి జగన్నాధ్  అంచనాలు పెంచేశాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ కి జంటగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తున్నారు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఈ మూవీ నిర్మాణంలో భాగస్వామిగా ఉండగా... పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.