Asianet News TeluguAsianet News Telugu

అమెరికాలో సంక్రాంతి సినిమాల పరిస్దితి ఏమిటి?

 అందులో రవితేజ క్రాక్ సినిమాలు హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఎనర్జీ స్టార్ రామ్ సినిమా రెడ్, బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్  నిన్న (జనవరి 14) విడుదల అయ్యాయి కానీ అంత గొప్పగా లేవు అని టాక్ వచ్చేసింది. ఇక తమిళ డబ్బింగ్ మాస్ట్రర్ సైతం ప్లాఫ్ బాట పట్టింది. అయితేనేం ఈ పండగ మూడు రోజులు కలెక్షన్స్ బాగానే ఉన్నాయి.  
  
Poor Collections to Sankrathi telugu movies in USA jsp
Author
Hyderabad, First Published Jan 15, 2021, 6:04 PM IST

కరోనా దెబ్బతో దాదాపు పదినెలలు మూత పడిన సినిమాహాళ్లు ఇటీవల తెరుచుకున్నాయి. అయినప్పటికీ అన్ని సినిమాలు విడుదల బాట పట్టలేదు. ప్రేక్షకులు సినిమాలను థియేటర్లకు వచ్చి ఎంతవరకూ చూస్తారని సందేహంతో రిలీజ్ లు ఆపుకు కూర్చున్నారు చాలా మంది నిర్మాతలు . మరి కొన్ని పెద్ద సినిమాలు వేసవి బరిలోకి వెళ్లాలని ఫిక్స్ అ్యయాయి. అయితే కొందరు మాత్రం ధైర్యం చేసారు. ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో  నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి.

 అందులో రవితేజ క్రాక్ సినిమాలు హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఎనర్జీ స్టార్ రామ్ సినిమా రెడ్, బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్  నిన్న (జనవరి 14) విడుదల అయ్యాయి కానీ అంత గొప్పగా లేవు అని టాక్ వచ్చేసింది. ఇక తమిళ డబ్బింగ్ మాస్ట్రర్ సైతం ప్లాఫ్ బాట పట్టింది. అయితేనేం ఈ పండగ మూడు రోజులు కలెక్షన్స్ బాగానే ఉన్నాయి.  
  
ఇక మన తెలుగు సినిమాలకు పెద్ద మార్కెట్ అయిన అమెరికాలోనూ సంక్రాంతి సినిమాలు అన్నీ థియేటర్లలోకి వచ్చాయి. “క్రాక్”, “మాస్టర్” ,“రెడ్”, “అల్లుడు అదుర్స్”  విడుదల అయ్యాయి. అమెరికాలో అన్ని సినిమాలు రన్ అవుతున్నాయి. అయితే, ఏ ఒక్క సినిమాకి కూడా అమెరికాలో చెప్పుకోదగ్గ కలెక్షన్స్ లేవు రాలేదు. ప్రీమియర్ షోలకు చెప్పుకోదగ్గ జనం లేరు. రెగ్యులర్ షోలదీ అదే పరిస్దితి.

 పండుగ మూడు రోజులు కూడా పికప్ కాలేదు. అక్కడ కరోనా ఇంకా కంట్రోలు లోకి రాకపోవటం, ఈ నాలుగు సినిమాల్లో క్రాక్ కు తప్ప దేనికీ హిట్ టాక్ రాకపోవటం కూడా ఈ డల్ భాక్సాఫీస్ కు కారణంగా చెప్తున్నారు. హిట్ టాక్ తో విడుదలయి నాలుగు రోజులు అయినా “క్రాక్” లక్ష డాలర్ల మార్క్ అందుకోవటం ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు. అలాగే విజయ్ వంటి పెద్ద స్టార్ ఉన్నా కూడా “మాస్టర్”కి వచ్చిన ఓపెనింగ్స్ రాలేదు. రామ్ నటించిన “రెడ్”, “అల్లుడు అదుర్స్”లు అంతంత మాత్రమే.

Follow Us:
Download App:
  • android
  • ios