గత కొంత కాలంగా పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పిస్తున్న కత్తి మహేష్ పవన్ కల్యాణ్ కు, ఫ్యాన్స్ కు సవాల్ విసిరి ఆదివారం మరింత రచ్చ చేసిన సంగతి తెలిసందే. చర్చకు పవన్ రాకపోవటంతో.. పూనమ్ కౌర్ పై కత్తి మహేష్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. పూనమ్ మాత్రం ఆ రేంజ్ లో ఆరోపణలు చేసిన కత్తి మహేష్ కు అండగా నిలుస్తోంది. పైగా సమస్య పరిష్కారానికి ని మిమ్మల్ని కలుస్తానని పూనమ్ పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలో వివాదం యు టర్నీ తీసుకుంది.

 

వివాదం క్లైమాక్స్‌ కు చేరుకుందనే దశలో అనూహ్యంగా వివాదం మరో మెట్టు ఎక్కింది. కత్తి చేసిన సంచలన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. అయితే మరో వైపు కత్తి మహేష్ పై కూడా ట్రోలింగ్ ముదిరింది. అయితే ఈ సమయంలో కత్తి మహేష్ పూనమ్ కౌర్ కు అండగా నిలవడం కత్తిక మద్దతుగా నిలవడం ఆశ్చర్యమే. కత్తికి మద్దతుగా ట్వీట్ చేసిన పూనమ్.. 'ఎవరైనా సరే, ఓ వ్యక్తి తల్లిని కించపరుస్తూ మాట్లాడకూడదు. నేను నిజాయితీగా అడుగుతున్నా.. దయచేసి కత్తి మహేష్ తల్లి గురించి మాట్లాడవద్దు' అని ఆ ట్వీట్ లో పేర్కొంది.

 

అంతే కాక పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి కూడా పూనమ్ ట్వీట్ చేసింది. 'వ్యక్తుల రహస్య ఎజెండాలకు రాజకీయంగా నేను టార్గెట్ కాదలుచుకోవడం లేదు. నేను మిమ్మల్ని కలిసి దీని గురించి చర్చించాలనుకుంటున్నాను' అని పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి పూనమ్ మరో ట్వీట్ చేసింది. దీనికితోడు 'గౌరవనీయులైన పవన్ కల్యాణ్ గారు.. ఇది నా కెరీర్, ఫ్యామిలీకి సంబంధించిన విషయం. కాబట్టి ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి నాకు సహాయం చేయండి' అని పూనమ్ మరో ట్వీట్ చేసింది. అయితే.. పవన్ నుంచి సహాయాన్ని కోరుతూ ట్వీట్ చేసిన పూనమ్ కౌర్.. ఆ వెంటనే వాటిని డిలీట్ చేసింది. పూనమ్ ట్వీట్స్ డిలీట్ చేయడంతో మరో చర్చకు తావిచ్చినట్లయింది.

 

కత్తి మహేష్ తనపై ప్రశ్నలు లేవనెత్తిన సమయంలో పూనం కౌర్ మహేష్ కత్తికి మద్దతుగా నిలవడం గమనార్హం. ఆదివారం ఓ టీవి ఛానెల్ డిబేట్‌లో కత్తితో పాటు కార్యక్రమంలో కూర్చొన్న ఓ వ్యక్తి.. 'మీ తల్లి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం.. చెప్పండి' అంటూ ఆయన్ను ప్రశ్నించారు. పదేపదే ఆ ప్రశ్న అడగడంతో.. సమాధానం చెప్పడానికి విముఖత వ్యక్తం చేసిన కత్తి.. డిబేట్ నుంచి వాకౌట్ చేశారు.

 

మొదట మహేష్ కత్తిని ఫ్యాట్సో అంటూ అవమానకరంగా ట్వీట్ చేసిన పూనమ్... తతనపై ఆరోపణల అనంతరం జరిగిన ఓ టీవి చర్చా కార్యక్రమంలో మహేష్ కత్తి తల్లి గురించి ప్రస్తావించడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు సోషల్ మీడియాలోనూ మహేష్ కత్తి తల్లి గురించి ప్రస్తావిస్తూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఆ ట్వీట్ పూనమ్ దృష్టికి రావడంతో ఆమె ఈ అంశంపై స్పందించింది. ఏదేమైనా ఆయన తల్లి గురించి మాట్లాడటం పద్దతి కాదనే రీతిలో పూనం కౌర్ హుందాగా స్పందించింది.

 

హీరోయిన్ పూనమ్ కౌర్ తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసినందువల్ల.. తాను కూడా కొన్ని విషయాలు ప్రస్తావించక తప్పట్లేదని కత్తి మహేష్ ఆదివారం సంచలన ప్రశ్నలు లేవనెత్తారు. ఆ ప్రశ్నలు ఆమె జీవితానికే మేలు చేస్తాయని కూడా అన్నారు. ఆ ఆరు ప్రశ్నలు పవన్ కల్యాణ్-పూనమ్ కౌర్ మధ్య సంబంధాన్ని, మధ్యలో త్రివిక్రమ్ ప్రమేయాన్ని గురించి ప్రశ్నించేలా ఉన్నాయి.

 

మహేష్ కత్తిని కించపరిచేలా అంతకుముందు ట్వీట్ చేసిన పూనమ్.. జరగాల్సిన డ్యామమేజ్ అంతా జరిగాక.. కత్తి మహేష్ పట్ల హుందాగా స్పందించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పూనమ్ ముందే హుందాగా స్పందించి ఉంటే.. కత్తి కూడా తనపై సంచలన ఆరోపణలు చేసేవాడు కాదు కదా? అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.