రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానెల్ లో పవన్ మోసం చేశాడు అంటూ విడుదలైన ఒక ఆడియో క్లిప్ పెద్దగా వైరల్ ఏమి కాలేదు. శ్రీరెడ్డి గారు దానిపై వివరణ ఇచ్చే సరికి కొన్ని మీడియాల్లో బ్రేకింగ్ న్యూస్ గా మారినా జనాలు కూడా అంతగా పట్టించుకోవడం లేదు. ఆ ఆడియో క్లిప్ పూనమ్ గారిది కాదని అందరికి అర్థమైపోయింది. 

ఇకపోతే ఈ తతంగం లో పూనమ్ కౌర్ పేరు వినిపించినప్పటికీ ఆమె సైలెంట్ గా ఉండడం అందరిని షాక్ గురి చేస్తోంది. మాట్లాడింది ఆమె అంటూ టైటిల్ ఇచ్చినా మేడం గారి నుంచి ఉలుకు పలుకు లేదు. నిరంతరం సోషల్ మీడియాలో ప్రతి విషయంపై స్పందిచే ఆమె ఇప్పుడు ఆడియో క్లిప్ పవన్ ని టార్గెట్ చేస్తూ సెగలు కక్కుతుంటే అమ్మడికి కనీసం కనిపించట్లేదా అని ప్రశ్నిస్తున్నారు. 

అలాగే అనవసరంగా వచ్చిన ఈ ఆడియో క్లిప్ లో ఉన్నది తన వాయిస్ కాదని సమాధానం చెబితే అయిపోతుంది కదా అని కామెంట్స్ వస్తున్నాయి. పవన్ పై గతంలో ఎలాంటి కుట్ర పూరిత కామెంట్స్ వచ్చాయో అందరికి తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలు ఎన్నికల సమయానికి మరింతగా ఫోకస్ చేశాయని టాక్ వస్తోంది. ఇక జనసేన ఇలాంటి విషయాల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. వీలైనంత వరకు ఇగ్నోర్ చేస్తూ ఎన్నికలపై ద్రుష్టి పెట్టింది. మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.