పూనమ్ పాండే.. బహుశా నెటిజన్లకు ఈ పేరు తెలియకుండా ఉండదేమో.! ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వాళ్లకైతే పూనమ్ పాండే హాట్ పిక్స్  చూసి పిచ్చెక్కిపోతుంటారు. ఇప్పుడీ భామ తన బాయ్ ఫ్రెండ్ ఎవరో ప్రపంచానికి పరిచయం చేసేసింది.

 

          2011 వరల్డ్ కప్ గెలుచుకొని వస్తే టీమిండియా ముందు బట్టలిప్పి నిలబడతానంటూ పాపులర్ అయిన మోడల్, నటి పూనమ్ పాండే. అప్పటి నుంచి ఈ భామ ఇండియాలో సూపర్ పాపులర్ అయిపోయింది. ఇక అప్పటి నుంచి ఈ భామ కొన్ని సినిమాల్లో ఛాన్సులు కూడా కొట్టేసింది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ, బాలీవుడ్ లో పను సినిమాల్లో నటించింది. తెలుగులో మాలిని అండ్ కో అనే సినిమా కూడా చేసింది. అయితే పెద్దగా పేరు రాలేదు. దీంతో మళ్లీ మోడలింగ్ లోనే స్థిరపడిపోయింది. 2011లో ఈ భామ 29 కేలండర్లకు ఫోజులిచ్చిందంటే ఈమె పాపులారిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ కేలండర్ లో కూడా ఈ భామ తళుక్కుమంది.

         ఇక సోషల్ మీడియాలో పూనమ్ పాండే చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లలో సెమీ న్యూడ్ ఫోటోలతో పూనమ్ రెచ్చిపోతూ ఉంటుంది. రోజుకో ఫోటోనో, వీడియోనో పెట్టకుండా ఈ భామకు నిద్రపట్టదంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ నెల 11వ తేదీన పూనమ్ పాండే బర్త్ డే జరుపుకుంది. ఈ సందర్భంగా పూనమ్ ఓ వ్యక్తిని పరిచయం చేసింది. అతనెవరో కాదు.. పూనమ్ బాయ్ ఫ్రెండ్ శామ్ బాంబే.! అతనితో కలిసున్న ఫోటోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన పూనమ్ పాండే .. తనకెంతో ఇష్టమైన వ్యక్తితో కలిసి బర్త్ డేను జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపింది.

ఎప్పుడూ హాట్ హాట్ పిక్స్ తో సందడి చేసే పూనమ్ పాండే.. తొలిసారి తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది. దీంతో నెటిజన్లు షాక్ కు గురయ్యారు. మరికొంతమందేమో పూనమ్ బాయ్ ఫ్రెండ్ ను చూశామనే సంతోషంతో ఆల్ ది బెస్ట్ చెప్తూ పోస్ట్స్ చేశారు.