Asianet News TeluguAsianet News Telugu

Poonam pandey: పూనమ్ పాండేను తీవ్రంగా గాయపరిచిన భర్త సామ్ బాంబే అరెస్ట్!

సామ్ బాంబే పూనమ్ ని తీవ్రంగా కొట్టడంతో, ముఖం, కళ్ళు,తల భాగంలో తీవ్ర గాయాలైనట్లు సమాచారం. పూనమ్ ఆసుపత్రిలో జాయిన్ కావడం జరిగింది. భర్త సామ్ బాంబే పోలీస్ కస్టడీలో ఉన్నారు. 
 

poonam pandey beaten up by husband sam bombay police took him to the custody
Author
Hyderabad, First Published Nov 9, 2021, 9:57 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కాంట్రవర్సియల్ మోడల్, నటి పూనమ్ పాండే (Ponam pandey) తన భర్తపై కేసు పెట్టారు. తనను శారీరకంగా హింసించాడని పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలోసామ్ బాంబేను సోమవారం అరెస్ట్ చేయడం జరిగింది. సామ్ బాంబే పూనమ్ ని తీవ్రంగా కొట్టడంతో, ముఖం, కళ్ళు,తల భాగంలో తీవ్ర గాయాలైనట్లు సమాచారం. పూనమ్ ఆసుపత్రిలో జాయిన్ కావడం జరిగింది. భర్త సామ్ బాంబే పోలీస్ కస్టడీలో ఉన్నారు. 


2020 సెప్టెంబర్ 10న సామ్ బాంబే (Sam bombay) ను పూనమ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. చాలా కాలంగా రిలేషన్ లో ఉన్న ఈ జంట పెళ్లితో ఒక్కటయ్యారు. పెళ్ళైన వారం రోజులకే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. హనీమూన్ కొరకు గోవా వెళ్లగా.. అక్కడ తనను శారీరకంగా, లైంగికంగా వేధించాడంటూ సామ్ బాంబే పై ఆమె కేసు పెట్టారు. గోవా పోలీసులు సామ్ బాంబేను అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత కాంప్రమైజ్ కావడంతో పాటు, కలిసి ఉంటున్నారు. 


తాజా వివాదంతో మరోసారి ఇద్దరి మధ్య దూరం పెరిగింది. సామ్ బాంబే, పూనమ్ పాండేను తీవ్రంగా గాయపరిచినట్లు తెలుస్తుంది. ఈ గొడవకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పూనమ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఇక కెరీర్ బిగినింగ్ నుండి పూనమ్ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా ఉన్నారు. 2011 వరల్డ్ క్రికెట్ టోర్నమెంట్ సమయంలో.. ఇండియా కప్ కొడితే, నగ్నంగా కనిపిస్తాను అంటూ... బోల్డ్ కామెంట్ చేసింది. పూనమ్ తీరుపై అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. 

Also read విడాకులపై పూనమ్ కౌర్ సంచలన ట్వీట్, అంతలోనే డిలీట్... సమంత గురించేనా!
అలాగే సామ్ బాంబే, పూనమ్ పాండే కోవిడ్ నిబంధనలు ఉల్లంగిస్తూ... ముంబైలో చక్కర్లు కొట్టగా.. పోలీసులు సామ్ బాంబేను అరెస్ట్ చేశారు. బాత్ రూమ్ లో డాన్స్ చేస్తూ వీడియో విడుదల చేసి మరో వివాదం రాజేసింది. నషా, లవ్ ఈజ్ పాయిజన్ వంటి బోల్డ్ చిత్రాల్లో నటించిన పూనమ్ అరడజనుకు పైగా హిందీ చిత్రాలలో కనిపించారు. 

Also read Samantha: సమంతకి అరుదైన గౌరవం.. `ఇఫీ`లో స్పీకర్‌గా.. తొలి దక్షిణాది నటి

Follow Us:
Download App:
  • android
  • ios