బాలీవుడ్ హీరోయిన్ పూనమ్ పాండే భర్త సామ్ బాంబేకు బెయిల్ దొరికింది. గోవా జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ షానూర్ ఆడి ఇరవై వేల రూపాయల పూచికత్తుపై అతనికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. దీనితో నేడు సామ్ బాంబే పోలీస్ కస్టడీ నుండి బయటపడ్డారు. పూనమ్ పాండే, సామ్ బాంబే కొంతకాలంగా రిలేషన్షిప్ లో ఉన్నారు. సెప్టెంబర్ 1న వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. 

ఈ జంట హనీమూన్ కోసం గోవా వెళ్లడం జరిగింది. అక్కడే ఓ చిత్ర షూటింగ్ లో పూనమ్ పాండే పాల్గొంటున్నారు. సడన్ గా వీరి మధ్య ఏమి సమస్య తెలెత్తిందో తెలియదు కానీ, సోమవారం రాత్రి పూనమ్ భర్తపై కేసు పెట్టింది. తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని, శారీరకంగా హింసించాడని గోవాలోని కనకోన పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సామ్ బాంబేను అరెస్ట్ చేయడం జరిగింది. నేడు బెయిల్ రావడంతో ఆయన విడుదల అయ్యారు. 

సామ్ బాంబే కనకోన పోలీస్ స్టేషన్ లో నాలుగు రోజులపాటు హాజరు కావాల్సవుంది. అలాగే కేసుతో ప్రమేయం ఉన్న ఎవరినీ కలవడానికి ప్రయత్నించకూడని జడ్జి ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఇక లైంగిక వేధింపులు, శారీక హింస నేపథ్యంలో పూనమ్ పాండే వైద్య పరీక్షలకు హాజరు కావాల్సివుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మధ్య నెల రోజులు కూడా గడవక ముందే ఇలాంటి వివాదాలు తెలుత్తుతుండగా వీరు విడిపోవడం ఖాయమేనన్న మాట గట్టిగా వినిపిస్తుంది.