Asianet News TeluguAsianet News Telugu

పూనమ్ పాండే కేసు: ఇద్దరు పోలీస్ లు సస్పెండ్

పూనమ్ పాండేను గోవా పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. పూనమ్‌ ఇటీవల గోవాలోని చపోలి ఆనకట్ట వద్ద అశ్లీల వీడియోను చిత్రీకరించిందని ఆరోపిస్తూ ఫార్వర్డ్ పార్టీ మహిళా విభాగం ఆమెపై ఫిర్యాదు చేసింది. దీనికి తోడు పూనమ్‌ పాండేపై అసభ్యకరమైన వీడియోను చిత్రీకరించినందుకు ఓ గుర్తు తెలియని వ్యక్తిపై మరో కేసు నమోదైంది. 
 

Poonam obscene case two cops suspended jsp
Author
hyderabad, First Published Nov 6, 2020, 7:49 AM IST

హాట్ మోడల్, బాలీవుడ్ నటి పూనమ్ పాండే ని గోవా పోలీస్ లు అరెస్ట్ చేసారు.   గోవాలోని చపోలి ఆనకట్ట వద్ద అశ్లీల వీడియోను షూట్ చేసిన కారణంగా ఆమెపై గోవాలోని కనకోవా పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు. గోవాకి చెందిన ఫార్వర్డ్ పార్టీ మహిళా విభాగం ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. గోవా సంస్కృతి,‌ చ‌పోలీ డ్యామ్ ప‌విత్ర‌త‌ను దెబ్బ తీసేలా ప్ర‌వ‌ర్తించినందుకే కేసు పెట్టామ‌ని గోవా ఫార్వ‌ర్డ్ మ‌హిళా విభాగం పేర్కొంది. 

ఫార్వర్డ్ పార్టీ ఫిర్యాదు మేరకు పూనమ్‌ను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వీడియో షూట్‌కు అనుమతి ఇచ్చినందుకు ఇద్దరు పోలీసులపై కూడా సస్పెన్షన్‌ వేటు పడింది. అయితే వివాదాలు,పోలీస్ లు, కేసులు పూనమ్ కు కొత్తకాదు కానీ ఇలా పోలీస్ లు ఇరుక్కుపోవటమే ఎప్పుడూ జరగలేదు.

ఇక గతంలో పూనమ్ పాండే తన భర్త సామ్ బాంబే పై దక్షిణ గోవాలోని కెనకోనా పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టిన విషయం తెలిసిందే.సామ్ అహ్మద్ తనపై దాడి చేసి, చెంపదెబ్బ కొట్టినట్లు పూనమ్ ఆరోపించింది. ఆ తర్వాత సామ్  బాంబే బెయిల్ పై విడుదలయ్యాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే పూన‌మ్‌ మ‌న‌సు మార్చుకొని భ‌ర్త‌తో క‌లిసిపోయి అంద‌రినీ ఆశ్చ‌ర్య పరిచింది.

Follow Us:
Download App:
  • android
  • ios