టాలీవుడ్ ప్రేక్షకులు పూనమ్ కౌర్ ని అంత సులువుగా మర్చిపోలేరు. సినిమాలతో కంటే వివాదాలతో బాగా ఫేమస్ అయింది ఈ బ్యూటీ. తెలుగులో 'శౌర్యం', 'వినాయకుడు' వంటి సినిమాలలో నటించిన ఈ బ్యూటీకి అవకాశాలు బాగా తగ్గాయి. పవన్ కళ్యాణ్ విషయంలో అమ్మడు చేసిన ఆరోపణల కారణంగా కెరీర్ పరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంది. 

సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ పూనమ్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసేవారు. ప్రస్తుతం ఈ వివాదం సద్దుమణిగినట్లే ఉంది. పూనమ్ కూడా తన కెరీర్ పైనే దృష్టి పెట్టాలనుకుంటోంది. కానీ ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. వివాదాలు కూడా లేకపోవడంతో లైమ్ లైట్ లో లేదు.

మళ్లీ క్రేజ్ పెంచుకోవడానికి హాట్ ఫోటో షూట్ లలో పాల్గొంటోంది. తాజాగా రెడ్ కలర్ టీషర్ట్, బ్లాక్ బాటమ్ ధరించి సముద్రం నేపధ్యంలో ఫోటోలు తీసుకుంది. నవ్వుతూ ఫోటోలకు ఫోజిచ్చింది. తనలో గ్లామర్ యాంగిల్ తగ్గలేదన్నట్లుగా తన ఫోటోలతో చెప్పాలనుకుంటోంది. 

ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టార్ హీరోయిన్లను సైతం అవకాశాలు దొరకడం లేదు. రకుల్, కాజల్ లాంటి స్టార్లు ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. ఈ క్రమంలో పూనమ్ లాంటి భామకి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చే నిర్మాతలు దొరకడమంటే కష్టమే..!