`మొదటి సినిమా` అనే చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన పూనమ్ బజ్వా.. `బాస్` చిత్రంలో నాగార్జునకి సెక్రెటరీగా నటించి ఆకట్టుకుంది. గ్లామర్ రోల్‌లో హీటెక్కించింది.
పూనమ్ బజ్వా(Poonam Bajwa) తెలుగులో నటించింది కొన్నిసినిమాలే అయినా తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. గ్లామర్ స్టాంప్‌ని వేసుకుంది. చిన్న చిన్నసినిమాలతోనే సక్సెస్ అందుకున్న ఈ భామ హాట్‌షో విషయంలో ఆరంభం నుంచే హద్దులు దాటేసింది. అయితే కెరీర్ పరంగా ఒడిదుడుకులు తప్పలేదు. కేవల స్కిన్‌షోకే ఆడియెన్స్ పట్టం కట్టరు. కూసంత నటన కౌసలం కూడా ఉండాలి. పూనమ్ బజ్వా విషయంలో అది కాస్త తక్కువే. దీంతో ఈభామకి తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి.
`మొదటి సినిమా` అనే చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన పూనమ్ బజ్వా.. `బాస్` చిత్రంలో నాగార్జునకి సెక్రెటరీగా నటించి ఆకట్టుకుంది. గ్లామర్ రోల్‌లో హీటెక్కించింది. నయనతారకే అసూయ పుట్టించింది. ఆ తర్వాత బన్నీ `పరుగు`లో ఫ్రెండ్ లవర్‌గా ఆకట్టుకుంది. `ప్రేమంటే ఇంతే`, `వేడుక`, `పరుగు` చిత్రాలతోనే టాలీవుడ్‌లో కెరీర్‌కి ఫుల్‌స్టాప్ పెట్టుకుంది. చివరగా ఆమె `ఎన్టీఆర్‌ః కథానాయకుడు` చిత్రంలో గారపాటి లోకేశ్వరి పాత్రలో కనిపించింది.
అయితే ఎక్కువగా తమిళంలోనే రాణించింది పూనమ్ బజ్వా. ప్రధానంగా కోలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి గుర్తింపుని, స్టార్‌స్టేటస్‌ని సొంతం చేసుకుంది. దీంతోపాటు కన్నడ, మలయాళంలోనూ సినిమాలు చేసి ఆకట్టుకున్నా, అవకాశాలు చాటేశాయి. దీంతో కెరీర్‌ని ఒకటి అరసినిమాలతో లాక్కోస్తుంది. అయితే ఈ బ్యూటీ కొంత గ్యాప్‌తో మళ్లీ సందడి చేయబోతుందట. రీఎంట్రీ ఇస్తుందట. కాకపోతే తమిళంలో ఆమె నటిస్తున్నట్టు తెలుస్తుంది.
ఇప్పుడు 'గురుమూర్తి' అనే చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమతోంది. నటరాజ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రెండ్స్ టాకీస్ పతాకంపై శివ చలపతి, సాయి శరవణన్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ప్రముఖ ఛాయాగ్రాహకుడు కేటీ ధనశేఖర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నిజాయితీపరుడైన పోలీసు అధికారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటిని ఆయన ఎలా ఛేదించి తన నిజాయితీని నిరూపించుకున్నారనే కథతో తెరకెక్కుతుందట.
షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్‌లో విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. మరి ఇందులో గ్లామర్ షో చేస్తుందా? అంతకు మించి ఉంటుందా? అనేది చూడాలి. దీంతోపాటు మలయాళంలో రెండు సినిమాలు చేస్తుంది పూనమ్. మరి తెలుగుకి ఎప్పుడు ముహూర్తం పెట్టుకుంటుందో చూడాలి. అయితే రెగ్యూలర్‌గా హాట్‌ఫోటో షూట్లు, స్కిన్ షోతో సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది పూనమ్ బజ్వా. ఆమె గ్లామర్ ఫోటోలకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారంటే అతిశయోక్తి లేదు. సినిమాల ద్వారా అలరించలేకపోయినా, ఇలా ఇన్‌స్టాలో సెక్సీ ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. హాట్ టాపిక్ అవుతుంది పూనమ్ బజ్వా.
