Asianet News TeluguAsianet News Telugu

నితిన్ తో పూజ ఓకే చెప్పాలంటే ఇదీ కండీషన్

తాజాగా నితిన్ సినిమాకోసం పూజను ట్రై చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆమె నితిన్ తో చేయటానికి నో చెప్పలేదు కానీ యస్ కూడా చెప్పలేదు. ఓకే చెప్పాలంటే ముందు ఓ కండీషన్ పెట్టింది. 

Pooja Hegdes team denies signing Nithins film jsp
Author
Hyderabad, First Published Jul 9, 2021, 7:23 AM IST

వరస హిట్స్ తో టాలీవుడ్‌‌లో స్టార్ హీరోయిన్‌‌ లో ఒకరుగా నిలదొక్కుకుంది పూజాహెగ్డే. తన ఖాతాలో ఇప్పుడు వరస పెట్టి సినిమాలు ఉన్నాయి. ప్రతీ స్టార్ హీరో తన ప్రక్కన పూజనే కోరుకుంటున్నారు. ఈ నేపధ్యంలో కొత్త సినిమా ఒప్పుకునేముందు హీరో స్టార్డమ్, బ్యానర్ వాల్యూ,డైరక్టర్ వంటివి చూసుకుని ఆచి,తూచి అడుగులు వేస్తోంది. తొందరపడి కాల్షీట్స్ ఇచ్చేయటం లేదు. దాంతో కొందరు హీరోలకు ఇది ఇబ్బందిగా మారింది. తాజాగా నితిన్ సినిమాకోసం ఆమెను ట్రై చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆమె నితిన్ తో చేయటానికి నో చెప్పలేదు కానీ యస్ కూడా చెప్పలేదు. ఓకే చెప్పాలంటే ముందు ఓ కండీషన్ పెట్టింది. దాంతో ఇప్పుడు ఆమె నితిన్ తో చేయబోతోందనే వార్తలు నిజం అవుతాయో లేదో అనే సందిగ్ద పరిస్దితి ఏర్పడింది.

వివరాల్లోకి వెళితే... పూజ హెగ్డే త్వరలో నితిన్‌‌కి జంటగా నటించనుందని మీడియాలో టాక్. ఇటీవల ‘మ్యాస్ట్రో’ చిత్రం షూటింగ్ పూర్తి చేసి నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టిన నితిన్, వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. త్వరలో పట్టాలెక్కనున్న ఈ చిత్రంలో హీరోయిన్‌‌గా పూజాహెగ్డేని తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలను ఆమె పర్శనల్ టీమ్ ఖండిస్తోంది. ఇంకా నితిన్ తో సినిమా ఆమె సైన్ చెయ్యలేదని అంటోంది. మొదట కథ విని, ఆమె క్యారక్టరైజేషన్ నచ్చి, ఆ తర్వాత వారు అడిగిన డేట్స్ అందుబాటులో ఉంటే అప్పుడు ఎగ్రిమెంట్ అవుతుందని అప్పటిదాకా అవి రూమర్స్ క్రింద లెక్కే అని టీమ్ తేల్చేసింది. అంటే పూజ చేస్తోందని అఫీషియల్ అనౌన్స్‌‌మెంట్‌‌ వచ్చేదాకా నమ్మటానికి లేదన్నమాట.

ఇక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పూజ హెగ్డే చక్రం తిప్పేస్తోంది. థియేటర్లు తెరచుకోటవం మొదలు కాగానే ఆమె సినిమాలు వరుసగా రానున్నాయి. అవన్నీ కూడా భారీ సినిమాలు .. పాన్ ఇండియా మూవీలు కావడం విశేషం. అలాగే పూజ తాజా చిత్రంగా అఖిల్ తో చేసిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత 'రాధేశ్యామ్' .. 'ఆచార్య' సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇక త్రివిక్రమ్ - మహేశ్ బాబు సినిమాలో హీరోయిన్ గా కూడా పూజ పేరునే వినిపిస్తోంది. ప్రస్తుతం విజయ్‌‌తో కలిసి తమిళ చిత్రం ‘బీస్ట్’ షూటింగ్‌‌లో పాల్గొంటోంది పూజ. మరోవైపు సర్కస్, భాయిజాన్ లాంటి బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టుల్లోనూ నటిస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios