పూజా హెగ్డేకి బిగ్‌ షాక్‌.. పవన్‌ సరసన యంగ్‌ సెన్సేషన్‌.. ?

పవన్‌ కళ్యాణ్‌- హరీష్‌ శంకర్‌ మూవీలో పూజా హెగ్డేని హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ ఇప్పుడు లెక్కలు మారిపోయాయట. ఓ క్రేజీ హీరోయిన్‌ని తీసుకుంటున్నారని సమాచారం. 

pooja hegde will replace with young crazy beauty in pawan movie?

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా రూపొందుతున్న చిత్రాల్లో `ఉస్తాద్ భగత్‌ సింగ్‌` ఒకటి. హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఇటీవలే గ్రాండ్‌గా ఈ మూవీ ప్రారంభమైన విషయం తెలిసిందే. వచ్చే నెలలో ఈ సినిమాని రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభించే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం పవన్‌ కళ్యాణ్‌ దాదాపు ముపై ఐదు రోజుల డేట్స్ ఇచ్చాడని తెలుస్తుంది. 

`ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`ని `థెరి`, `భవధీయుడు భగత్‌ సింగ్‌` మేళవింపుగా తెరకెక్కించబోతున్నారట. ఇందులో హీరో భార్య హత్య, చిన్నారి ఎపిసోడ్లు, సామాజిక అంశంని తీసుకుంటున్నారని, `భవదీయుడు భగత్‌సింగ్‌` స్క్రిప్ట్ కి దాన్ని యాడ్‌ చేసి `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`ని తెరకెక్కిస్తున్నట్టు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

ఇక సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేని అనుకున్నారు. సినిమా అనుకున్న ప్రారంభంలోనే పూజాని ఫైనల్‌ చేశారు దర్శకుడు హరీష్‌ శంకర్. గతంలో పూజాతో ఆయన `డీజే`, `గద్దల కొండ గణేష్‌` చిత్రాలు చేశారు. ఆ పరిచయం, కంఫర్ట్ కారణంగానే పూజాని పవన్‌ సినిమాలో ఓకే చేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పుడు హీరోయిన్‌ మారిందా? అనే ప్రచారం ఊపందుకుంది. పవన్‌ సరసన ఈ చిత్రంలో కొత్త హీరోయిన్‌ పేరు వినిపిస్తుంది. 

ప్రస్తుతం టాలీవుడ్‌లో యంగ్‌ సెన్సేషన్‌గా రాణిస్తున్న శ్రీలీలాని అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది. మరి శ్రీలీలా మెయిన్‌ హీరోయిన్‌గా ఉండబోతుందా, లేక సెకండ్‌ హీరోయిన్‌గానా? అనేది సస్పెన్స్ గా మారింది. శ్రీలీలా మెయిన్‌ లీడ్‌లో చేస్తే పూజా హెగ్డే పోస్ట్ కి ఎసరు పెట్టినట్టే, ఇదేనిజమైతే బుట్టబొమ్మకి పెద్ద షాకే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఇందులో నిజమెంతా అనేది మున్ముందు తేలనుంది. 

అయితే పవన్‌ కళ్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కలిసి `వినోదయ సీతం` చిత్రంలో నటిస్తున్నారు. దీనికి `దేవుడు` అనే టైటిల్‌ అనుకుంటున్నట్టు సమాచారం. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాయికి కేతిక జోడీ కట్టనుందట. ప్రియా ప్రకాష్‌ వారియర్‌ కీలక పాత్రలో కనిపిస్తారట. పవన్‌కి హీరోయిన్‌ లేదని సమాచారం. అయితే ఇందులో ఓ ఐటెమ్‌ సాంగ్‌ని ప్లాన్‌ చేస్తున్నారట, బాలీవుడ్‌ పాపులర్‌ సింగ్‌ `కజ్‌రారే`ని రీమిక్స్ చేస్తారనేది భోగట్టా. ఇందులో శ్రీలీలా ఆడిపాడబోతుందని సమాచారం. మరి ఏది నిజం అనేది తెలియాల్సి ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios