టైం కలసి రావడం అంటే ఇదే కాబోలు.  ఒకే ఒక్క సీన్ తో టాప్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోవడం అంటే చాలా అరుదైన విషయం. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన భామామణి పూజా హెగ్డే. అప్పటికే కొంత ఇమేజ్ ఉన్నా.. డీజే మూవీలో స్విమ్మింగ్ పూల్ నుంచి బ్లాక్ బికినీతో బైటకు నడిచొచ్చే సీన్.. ఈమెను స్టార్ హీరోయిన్ చేసేసింది. 

అందుకే ఇప్పుడు ఎన్టీఆర్.. రామ్ చరణ్... మహేష్ బాబు.. ప్రభాస్.. లాంటి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు పట్టేసింది. ఆమె కోసం స్టార్ హీరోలు సైతం డేట్స్ కోసం క్యూ కట్టారు. స్టార్ హీరోలనే కాదు.. తెలుగు జనాలను కూడా పూజా హెగ్డే విపరీతంగా ఆకట్టుకుంది. అలా ఇప్పుడు హైద్రాబాద్ కి మోస్ట్ డిజైరబుల్ ఉమన్ అయిపోయింది. తాజాగా టైమ్స్ గ్రూప్ నిర్వహించిన ఓటింగ్ లో.. ఈమెకు తెలుగు జనాలు అగ్రస్థానం కట్టబెట్టేసి టాప్ ప్లేస్ లో నిలబెట్టేశారు. కాజల్ అగర్వాల్ సెకండ్ ప్లేస్ కి.. రకుల్ ప్రీత్ మూడవ స్థానానికి పరిమితం అయిపోయారంటే బ్యూటీ పూజా క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది. 

ఈ లిస్ట్ లో పీవీ సింధు 4.. ఆదా శర్మ 5..  తమన్నా 6.. సిమ్రాన్ చౌదరి 7.. శృతి వ్యాకరణం 8.. అనుష్క శెట్టి 9.. మిథాలీ రాజ్ 10వ స్థానాల్లో ఉన్నారు. ఇంతగా అందరినీ మెప్పించడంలో కేవలం గ్లామర్ ఒకటే భాగం కాదని.. అందానికి ఆకర్షణ.. ఆ రెండింటికి మేథస్సు ప్లస్ తెగువ తోడయితేనే.. మోస్ట్ డిజైరబుల్ అనిపించుకోగలమని చెబుతోంది పూజా హెగ్డే.