కెరీర్ ఆరంభంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న పూజా హెగ్డే ఆ తర్వాత డీజే చిత్రంతో ఆమె జాతకమే మారిపోయింది.

కెరీర్ ఆరంభంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న పూజా హెగ్డే ఆ తర్వాత డీజే చిత్రంతో ఆమె జాతకమే మారిపోయింది. స్టార్ బ్యూటీగా మారింది. పూజా హెగ్డే ఇప్పటి వరకు టాలీవుడ్ లో అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు, నాగ చైతన్య లాంటి స్టార్స్ తో ఆడి పాడింది. 

అయితే ఇటీవల పూజా హెగ్డేకి అవకాశాలు తగ్గడంతో ఆమె కెరీర్ నెమ్మదించింది. పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య లాంటి చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. దీనితో పూజా హెగ్డేకి అవకాశాలు తగ్గాయి. ఇక ఈ బుట్టబొమ్మకి టాలీవుడ్ లో గేట్లు మూసుకుపోయినట్లేనా అనుకుంటున్న తరుణంలో క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. 

సెకండ్ వేవ్ తరహాలో పూజా హెగ్డేకి మరోసారి ఆఫర్స్ మొదలైనట్లు టాక్. ఓజి డైరెక్టర్ సుజిత్ నెక్స్ట్ మూవీ నేచురల్ స్టార్ నానితో ఉండబోతోంది. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డేని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. 

కొన్ని రోజుల క్రితం పూజా హెగ్డే.. నాగ చైతన్య సరసన కూడానా ఛాన్స్ దక్కించుకున్నట్లు న్యూస్ వచ్చింది. చైతు, విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో కూడా పూజా హెగ్డే కోసమే ప్రయత్నిస్తున్నారట. అంటే బుట్టబొమ్మ తాకిడి టాలీవుడ్ లో సెకండ్ వేవ్ మొదలైనట్లే అని అంటున్నారు.