ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది నటి పూజాహెగ్డే..
ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది నటి పూజాహెగ్డే.. జయాపజయాలతో సంబంధం లేకుండా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. అయితే ఒకేసారి ముగ్గురు హీరోలతో కలిసి పని చేయడం తన కెరీర్ లోనే బెస్ట్ ఎక్స్ పీరియన్స్ అని చెబుతోంది.
గతేడాది ఒకేసారి నాలుగు సినిమాలు చేసింది ఈ బ్యూటీ. ఆ సంగతులు చెబుతూ.. ''పాత తరం హీరోల్లా కొన్ని సార్లు నేను కూడా మూడు షిఫ్ట్ లు పని చేశాను. ఒక టైం లో ఉదయం 7 నుండి 12 వరకు ఎన్టీఆర్ తో 'అరవింద సమేత', మధ్యాహ్నం 2 నుండి 6 వరకు మహేష్ బాబు 'మహర్షి', రాత్రి 9 నుండి ఉదయం 2 గంటల వరకు ప్రభాస్ తో సినిమా చేశాను'' అంటూ చెప్పుకొచ్చింది.
ఇలా ఒకేరోజు, ఒకేసారి ముగ్గురు పెద్ద హీరోలతో కలిసి చేయడం తన కెరీర్ లో బెస్ట్ మూమెంట్ అని అంటోంది. తనకు నిద్ర కూడా పెద్దగా అవసరం లేదని రోజుకి నాలుగైదు గంటలు ఉంటే సరిపోతుందని చెబుతోంది.
ఎంత తక్కువ పడుకుంటే తను అంత అందంగా కనిపిస్తానని అంటోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'మహర్షి' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
