రంగస్థలంలో పూజా హెగ్డే రామ్ చరణ్ తో ఐటమ్ నంబర్ లో పూజా రొమాన్స్ డీజే తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటిస్తున్న పూజా

ముకుంద సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ఆ సినిమాలో తన క్యూట్ లుక్స్ తో అలరించింది. ఆ తర్వాత వచ్చిన ఒక లైలా కోసం సినిమాలో కూడా ఇంప్రెస్ చేసింది. బాలీవుడ్ లో ఏకంగా హృతిక్ రోషన్ సరసన మొహెంజోదారో మూవీలో చేసినా అది ఫ్లాప్ అయ్యే సరికి అమ్మడు మళ్లీ టాలీవుడ్ మీదే ఫోకస్ పెట్టింది. బన్ని డిజెలో అందాలతో ఆడియెన్స్ ను అలరించిన పూజా తాజాగా కొత్త లాజిక్ పట్టుకుంది.

ఈ మధ్య పూజా ఫోటో షూట్స్ కూడా క్రేజీగా మారాయి. ఇక ప్రస్తుతం అమ్మడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ డైరక్షన్ లో వస్తున్న సినిమాలో నటిస్తుంది. తన సినిమాల్లో హీరోయిన్స్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వని బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం క్రేజ్ లో ఉన్న పూజా హెగ్దెతో రొమాన్స్ చేస్తున్నాడు.

డీజెలో కన్నా ఇందులో అమ్మడు మరింత హాట్ గా కనిపించబోతుందట. సినిమాలో పూజా అందాలను ఫుల్ గా వాడేస్తున్నారని టాక్. ఎలాగు ఇలా ఉంటేనే తనకు డిమాండ్ ఉంటుందని అమ్మడు ఏమాత్రం అడ్డు చెప్పట్లేదట. మొత్తానికి బెల్లంకొండ బాబుతో పూజా రొమాన్స్ పీక్స్ లో ఉండబోతుందని తెలుస్తుంది. 

ఇక సినిమాలో పూజా అందాలనే హైలెట్ చేస్తూ వస్తున్నారట. డిజె సక్సెస్ తో కాస్త మైలేజ్ ఏర్పరచుకున్న అమ్మడు ఈ సినిమాతో టాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తుంది. సినిమాకు కోటికి పైగా రెమ్యునరేషన్ తీసుకున్న అమ్మడు సినిమాలో అంతకుమించి అందాలను ఆరబోసిందట. ప్రస్తుతం వారణాసిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో రిలీజ్ అవనుంది.

ఇక అసలు విషయానికొస్తే.. పూజా తాజాగా బంపర్ ఆఫర్ కొట్టేసింది. మమెగా పవర్ స్టార్ రామ్ చరణ్,.. సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న... రంగస్థలం మూవీలో పూజా హెగ్డే... స్పెషల్ ఐటమ్ నంబర్ లో నర్తించనుందట. ఇలా కొత్త లాజిక్ పట్టుకుని టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని ప్రయత్నిస్తోంది పూజ.