బుట్ట బొమ్మ పూజా హెగ్డే మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఎదురైనా పరాజయాలు పూజా హెగ్డేని బాగా ఇబ్బంది పెట్టాయి. పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా దెబ్బతిన్నాయి.

బుట్ట బొమ్మ పూజా హెగ్డే మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఎదురైనా పరాజయాలు పూజా హెగ్డేని బాగా ఇబ్బంది పెట్టాయి. పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా దెబ్బతిన్నాయి. దీనితో ఆ అమ్మడికి బ్యాడ్ టైం మొదలైనట్లు ఉంది అంటూ కామెంట్స్ వినిపించాయి. 

కానీ పూజా హెగ్డేకి ఆఫర్స్ ఏమాత్రం తగ్గడం లేదు. పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ జనగణమన ఛాన్స్ కొట్టేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోతోంది. తాజాగా ఈ డస్కీ బ్యూటీని మరో ఆఫర్ వరించినట్లు టాక్. 

మాస్ చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వంలో హీరో సూర్య 42వ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని సూర్య హోమ్ బ్యానర్ స్టూడియో గ్రీన్, యువీ క్రియోషన్స్ సంస్థ కలసి నిర్మించబోతున్నాయి. పూజా హెగ్డే ఇప్పటికే యువి క్రియేషన్స్ బ్యానర్ లో రాధే శ్యామ్ చిత్రంలో నటించింది. రాధే శ్యామ్ నిర్మాతలకు, పూజా హెగ్డేకి మధ్య విభేదాలు ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. పూజా హెగ్డే ప్రవర్తనతో రాధే శ్యామ్ నిర్మాతలు ఇబ్బంది పడ్డారట. 

మరోసారి పూజా హెగ్డేకి ఛాన్స్ ఇవ్వడంతో ఆసక్తికర చర్చ మొదలైంది. అయితే సూర్య వల్లే పూజా హెగ్డేకి ఈ చిత్రంలో ఛాన్స్ దక్కినట్లు తెలుస్తోంది. సూర్య మాట కాదనలేక యువి నిర్మాతలు బుట్టబొమ్మని తీసుకునేందుకు అంగీకరించారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడబోతున్నట్లు తెలుస్తోంది.