టాలీవుడ్ లో 'డీజే' సినిమా వచ్చేవరకు నటి పూజా హెగ్డేకి సరైన హిట్టు లేదు. ఆ సినిమాతో ఆమె కెరీర్ ఊపందుకుంది. వరుస ఆఫర్లతో టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా గడుపుతోంది. ఆమె ఇండస్ట్రీకి వచ్చి ఐదు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఆమె సినిమాల సంఖ్య సింగిల్ డిజిట్ లోనే ఉంది.

దానికి కారణం ఏంటని ఆమెని ప్రశ్నిస్తే... బాలీవుడ్ సినిమానే అని చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లో 'మొహంజదారో' సినిమా ఒప్పుకొని తప్పు చేసినట్లు చెబుతోంది. బాలీవుడ్ లో ప్రారంభంలోనే పెద్ద సినిమా అవకాశం రావడంతో ఉత్సాహంతో రెండు సంవత్సరాల  డేట్స్ ఇచ్చేశానని, ఓ నటి కెరీర్ లో రెండు సంవత్సరాలు ఎంత కీలకమో ఆ సమయంలో తెలియలేదని చెప్పింది.

ఆ తరువాత తెలుసుకున్నా.. ఫలితం లేదని, అలానే తను చేసిన కొన్ని సినిమాలు మంచి ఫలితాన్ని ఇవ్వకపోవడంతో తరువాతి సినిమాల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం లేదని తెలిపింది.

తన నుండి ఎక్కువ సినిమాలు రాకపోవడానికి కారణం ఇదేనని చెప్పింది. తొందరతొందరగా సినిమాలు చేసి అంతే ఫాస్ట్ గా తెరమరుగు కావడంతో తనకు ఇష్టం లేదని  చెప్పుకొచ్చింది. ఈ మాట తను ఎవరినీ ఉద్దేశించి అనడం లేదని వివరణ ఇచ్చింది.