ఎంత అందమున్నా..మారేంత టాలెంట్ ఉన్నా.. హిట్లు పడితే నే ఎవ్వరికైనా అవకాశాలు అందుతాయి. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ చిర్ల వద్ద ఈజీగా ఛాన్సులు కొట్టేస్తున్న పూజా హెగ్డే అదృష్టం మాములుగా లేదు. అరవింద సమేతలో ఊహించని విధంగా ఛాన్సెస్ కొట్టేసిన ఈ బ్యూటీ ముకుందా సినిమాతో సింపుల్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

అమ్మడు హిట్స్ లేక మొదట్లో కొన్నాళ్లవరకు ఇబ్బంది పడింది. ఇక బికినీ వేసి ఫోటో షూట్స్ తో రెచ్చిపోవడంతో దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో అవకాశం అందుకుంది. ఆ సినిమాలో బికినీ సీన్ అమ్మడికి మంచి క్రేజ్ తీసుకువచ్చింది. గ్లామర్ గర్ల్ గా ప్రింటెసుకొని స్టార్ హీరోల దృష్టిని ఆకర్షించింది. అయితే డీజే అంతగా హిట్టవ్వలేదు. 

ఇక ఆ తరువాత చేసిన సాక్ష్యం - అరవింద సమేత సినిమాలు కూడా పూర్తిగా సక్సెస్ అనే టాక్ ను ఇవ్వలేదు. మధ్యలో రంగస్థలం సినిమాలో జిగేల్ రాణి అంటూ హైప్ క్రియేట్ చేసుకుంది. మహేష్ మహర్షి సినిమాలో కూడా ఊహించని విధంగా ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమా వచ్చే నెల విడుదల కానుంది. 

ఇక ఈ ఆఫర్స్ వల్ల ప్రభాస్ తో రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసింది. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.  రీసెంట్ గా బన్నీ - త్రివిక్రమ్ ప్రాజెక్టుకి కూడా అమ్మడు డేట్స్ ఇచ్చేసింది. ఫైనల్ గా ఇంతవరకు ఒక కాన్ఫిడెంట్ హిట్టుకొట్టని జిగేల్ రాణి అందంతో అలా అలా ఆఫర్స్ అందుకుంటూ వెళుతోంది.