రామ్‌చరణ్‌కి లవ్‌ ఇంట్రెస్ట్ దొరికేసింది.. పూజా హెగ్డే ఓకే చెప్పింది..?

రామ్‌చరణ్‌ కి లవ్‌ ఇంట్రెస్ట్ సెట్‌ అయ్యింది. ఆయనతో ఆడిపాడేందుకు, రొమాన్స్ చేసేందుకు అమ్మాయి దొరికింది. ఆమె ఎవరో కాదు స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే. గతేడాది `అలా వైకుంఠపురములో` చిత్రంతో బంపర్‌ హిట్‌ని అందుకున్న పూజా ఫస్ట్ టైమ్‌ రామ్‌చరణ్‌తో ప్రేమ పాఠాలు నేర్చుకోబోతుంది. 

pooja hegde love intrest with ram charan in acharya  arj

రామ్‌చరణ్‌ కి లవ్‌ ఇంట్రెస్ట్ సెట్‌ అయ్యింది. ఆయనతో ఆడిపాడేందుకు, రొమాన్స్ చేసేందుకు అమ్మాయి దొరికింది. ఆమె ఎవరో కాదు స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే. గతేడాది `అలా వైకుంఠపురములో` చిత్రంతో బంపర్‌ హిట్‌ని అందుకున్న పూజా ఫస్ట్ టైమ్‌ రామ్‌చరణ్‌తో ప్రేమ పాఠాలు నేర్చుకోబోతుంది. 

రామ్‌చరణ్‌ ప్రస్తుతం `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. చిరు సరసన కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో చరన్‌ `సిద్ధ` అనే ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా పూజా హెగ్డేని ఫైనల్‌ చేశారట. తాజాగా ఈ విషయం ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతుంది. మొదట ఇందులో రష్మిక మందన్నా పేరు వినిపించింది. ఆమె బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో పూజాని ఫైనల్‌ చేశారని టాక్‌. 

ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగులో ప్రభాస్‌తో `రాధేశ్యామ్‌` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు అఖిల్‌తో `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌`లో ఆడిపాడుతుంది. `ఆచార్య` వంటి మరో బిగ్‌ ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసింది. ఇందులో పూజా పాత్ర నిడివి ఎక్కువ ఉండదని టాక్‌.మరోవైపు పూజా హిందీలో `సర్కస్‌` అనే సినిమా చేస్తుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios