Asianet News TeluguAsianet News Telugu

వచ్చే ‘సంక్రాంతి రాణి’ పూజా హెగ్డే నే,ఎందుకంటే రెండు

పూజా హెగ్డే నటించిన రెండు సినిమాలు  ఈ సంక్రాంతికి రానున్నాయి. దాంతో ఆమెను సంక్రాంతి రాణిగా పిలుస్తున్నారు.

Pooja Hegde is likely to become the queen of the Sankranthi season
Author
Hyderabad, First Published Aug 3, 2021, 10:52 AM IST

సంక్రాంతి సీజన్‌ అంటే తెలుగు,తెలుగు సినిమా పరిశ్రమలకి,సినీ లవర్స్ అసలైన పండగ. మిగతా రోజుల్లో  ఎన్ని సినిమాలొచ్చినా సంక్రాంతి రిలీజ్ చేడటంలో ఉండే కిక్కే వేరబ్బా అంటూంటూంటారు. ఆ సీజన్ ఎన్నీ సినిమాలు వచ్చినా వరసపెట్టి చూసేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉంటారనేది పరిశ్రమ వర్గాల నమ్మకం. పదిహేను రోజులపాటు సాగే ఆ సీజన్‌లో మూడు నాలుగు సినిమాలు భాక్సాఫీస్ వద్ద హడావిడి చేస్తుంటాయంటే కారణం అదే. అయితే  స్టార్స్ సినిమాలు మాత్రం రెండుకి మించి విడుదల కావు. అలా విడుదల చేస్తే వసూళ్లకి గండి పడుతుందనే ట్రేడ్ లో తెలుసు కాబట్టి జాగ్రత్తపడతారు. ఇద్దరు స్టార్స్ చిత్రాలు...మరో చిన్న సినిమా. వీటికితోడు ఓ డబ్బింగ్ చిత్రం. ఇప్పటిదాకా ఇదే లెక్కలోనే సంక్రాంతి చిత్రాలు విడుదలవుతూ వచ్చాయి. కానీ వచ్చే పండగకి మాత్రం ఈ లెక్క మరో రకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా పూజా హెగ్డే నటించిన రెండు సినిమాలు  ఈ సంక్రాంతికి రానున్నాయి.

2020  సంక్రాంతికి పూజా హెగ్డే నటించిన అల వైకుంఠపురములో రిలీజ్ అయ్యి పెద్ద హిట్టైంది. ఇప్పుడు ఆమె నటిస్తున్న  ‘రాధేశ్యామ్‌’తోపాటు, ‘బీస్ట్‌’ (విజయ్) కూడా రిలీజ్  కానుంది. దాంతో ‘సంక్రాంతి రాణి’ పూజా హెగ్డే నే ఫిక్స్ అయ్యిపోతున్నారు ఫ్యాన్స్. 

 మన స్టార్స్ లో  చాలా మంది గురి సంక్రాంతిపైనే పడింది. ఇప్పటికే ‘సర్కారు వారి పాట’, ‘రాధేశ్యామ్‌’తోపాటు పవన్‌కల్యాణ్‌ - రానా నటిస్తున్న ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’ రీమేక్‌.... ఈ మూడూ ముగ్గుల పండక్కి తమ సినిమాలు వస్తున్నాయని ప్రకటించేసాయి. మరికొన్ని రేసులో కనిపిస్తున్నాయి. చివరికి పక్కాగా పండగ బరిలో నిలిచే సినిమాలు ఏంటనేది ఆసక్తికరంగా మారింది. రెండో దశ కరోనా మొదలు కాక ముందు వరకూ 2022 సంక్రాంతి బరిలో రెండు సినిమాలే కనిపించాయి. ఒకటి.. పవన్‌కల్యాణ్‌ ‘హరి హర వీరమల్లు’, మరొకటి ‘సర్కారు వారి పాట’. 

కరోనా తర్వాత కొత్త చిత్రాలు  తెరపైకొచ్చాయి. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ‘హరి హర వీరమల్లు’ స్థానంలో, పవన్‌కల్యాణ్‌ కొత్త చిత్రం ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’ రీమేక్‌    జనవరి 12న రానుంది.. మహేష్‌ ‘సర్కారు వారి పాట’ ముందు చెప్పినట్టుగానే పండగ కోసమే రెడీ అవుతుండగా, ‘రాధేశ్యామ్‌’ ఊహించని విధంగా జనవరి 14న అంటూ విడుదల తేదీని ఖాయం చేసింది. దాంతో సంక్రాంతి సినిమాల పోటి రసవత్తరంగా మారింది.  ఇలాంటి మూడు చిత్రాలు ఒకేసారి   ప్రేక్షకుల ముందుకొస్తాయంటే బాక్సాఫీసు కళకళలాడటం ఖాయం. 

ఇక పూజ విషయానికి వస్తే.. తెలుగులో ‘రాధేశ్యామ్‌’, ‘ఆచార్య’, ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’, తమిళంలో ‘బీస్ట్‌’, హిందీలో ‘సర్కస్‌’, సల్మాన్‌ ఖాన్‌తో ఒక సినిమా చేస్తున్నారామె. అలాగే ఎన్టీఆర్‌–కొరటాల శివ సినిమాలో, రామ్‌చరణ్‌– శంకర్‌ సినిమాలో, ధనుష్‌–శేఖర్‌ కమ్ముల చిత్రంలోనూ పూజా హెగ్డేని హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios