పూజా హెగ్డే తెలుగులో స్టార్ హీరోలతో నటిస్తూ టాప్ హీరోయిన్‌గా నెంబర్ వన్ ప్లేస్ కు దూసుకెళ్తోంది. అంతేకాకుండా అత్యధిక రెమ్యునేషన్ తీసుకునే హీరోయిన్‌లలోనూ పూజా హెగ్డే ఒకరని చెప్పొచ్చు. ఇలా ఫామ్ లో ఉన్న సమయంలోనే  పూజా టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా బిజీగా మారే  ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడ తెలుగులో సినిమాలు చేస్తూనే హిందీలో పీఆర్ మెయింటైన్ చేస్తోంది.దాంతో ఆమె ముందు పెద్ద ప్రాజెక్టులు వాలుతున్నాయి. ఇది చూసి మిగతా హీరోయిన్స్..పూజ పెద్ద ముదురే..ఈ తెలివి మాకు లేకే అని ఫీలయ్యే పరిస్దితి.  ప్రస్తుతం ప్రస్తుతం సల్మాన్ ఖాన్  సరసన ‘కబీ ఈద్ కబీ దివాళి’  చిత్రంలోనూ నటిస్తోన్న ఆమె మరో కొత్త సినిమా కమిటైంది.

రోహిత్ శెట్టి డైరెక్షన్‌లో 'సర్కస్' అనే సినిమాలో రణ్‌వీర్ సింగ్  హీరోగా.. జాక్వెలిన్ ఫెర్నాండేజ్, పూజా హెగ్డే హీరోయిన్‌లుగా  నటించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ వచ్చే నెల నుండి ప్రారంభం కానుంది అని టాక్. షేక్ స్పీయర్ రచన ''ది కామెడి ఆఫ్ ఎర్రర్''  ఆధారంగా తెరకెక్కనుంది. టి సిరీస్ భూషణ్ కుమార్, రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి రోహిత్ శెట్టి స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.  

ఇక 2016లోనే మొదటిసారిగా మొహెంజో దారో చిత్రం ద్వారా బాలీవుడ్‌కి పరిచయమైన పూజా హెగ్డెకు ఆ చిత్రం అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. హృతిక్ రోషన్ సరసన చేసిన మొహెంజో దారో మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్  సరసన ‘హౌజ్‌ఫుల్ 4’ సినిమాలో నటించింది. ఆ సినిమా మంచి సక్సెస్ అయ్యింది. 

 పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. అలాగే అఖిల్‌తో కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుందని వినిపిసోతంది.  ఈ సినిమాకు ప్రీ టీజర్ సైతం విడుదల చేశారు.