పూజా హెగ్డే ఇంట్లో విషాదం నెలకొంది. వాళ్లు బామ్మ చనిపోయారు. తాను ఎంతగానో ఇష్టపడే, ప్రేమించే అమ్మమ్మని కోల్పోయినట్టు పూజా హెగ్డే తెలిపారు. ఆమె సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అమ్మమ్మతో దిగిన ఫోటోని పంచుకుంటూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా పూజా పోస్ట్ చేస్తూ, `ఈ క్యూటీని మేం కోల్పోయాం. ఎన్ని కష్టాలున్నా, ఎప్పుడూ నవ్వుతూనే ముందుకుసాగాలని మాకు నేర్పింది. భౌతికంగా తాను దూరమైనా, ఎప్పటికీ మాతోనే ఉంటుంది` అని చెప్పింది. 

ఇంకా చెబుతూ, `జీవితంలో కావాల్సిన వాళ్ల కోసం ఈగోలను పక్కన పెట్టడం ఎలానో నేర్పించింది. షూటింగ్‌ టైమ్‌లో ఎలా ఉన్నావ్‌? ఏం చేస్తున్నావ్‌, భోజనం చేశావా అంటూ ఎప్పటికప్పుడు నా బాగోగులు ఆడిగి తెలుసుకునేది. ఇకపై నీ ఫోన్‌ కాల్స్ మిస్‌ అవుతాను. లవ్‌యూ ఆజీ` అని ఎమోషనల్‌ అయ్యారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు పూజా ద్వారా వాళ్ల బామ్మకి సంతాపం తెలియజేస్తున్నారు.

  పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌తో `రాధేశ్యామ్‌` చిత్రంలో నటిస్తుంది. ఇది జులై 30న విడుదల కానుంది. దీంతోపాటు అఖిల్‌తో `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రంలో నటిస్తుంది. చిరంజీవి హీరోగా రూపొందుతున్న `ఆచార్య`లో అతిథి పాత్రలో కనిపించనుందట. ఇందులో చెర్రీకి జోడిగా కనిపించనుందని టాక్‌ మరోవైపు హిందీలో సల్మాన్‌తో `కభీ ఈద్‌ కభీ దీవాళి`, రణ్‌వీర్‌ సింగ్‌తో `సర్కస్‌` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది పూజా.