అక్కినేని వారసుడు అఖిల్ ఇంకా హిట్ తలుపు తట్టలేదు. అఖిల్ నటించిన గత మూడు చిత్రాలు అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయాయి. అఖిల్ డెబ్యూ మూవీ వి వి వినాయక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో నిర్మించారు. అఖిల్ పేరుతో విడుదలైన ఆ చిత్రం ప్లాప్ గా నిలిచింది. తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన హలో, మూడో చిత్రంగా వచ్చిన మిస్టర్ మజ్ను కూడా హిట్ అందుకోలేకపోయాయి. 

పరాజయాల హ్యటిక్ పూర్తి చేసిన అఖిల్ ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. దీనికోసం బొమ్మరిల్లు ఫేమ్ భాస్కర్ ని ఎంచుకోవడం జరిగింది. భాస్కర్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ని తెరకెక్కిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.  ఐతే నేడు దసరా పండుగను పురస్కరించుకొని మూవీ టీజర్ విడుదల చేశారు. 

దాదాపు నిమిషం నిడివి కలిగిన టీజర్ లో పూజా హెగ్డే ఆట్టిట్యూడ్ చాలా భిన్నంగా ఉంది. పెళ్లి కోసం వివిధ అమ్మాయిలతో పెళ్లి చూపులలో పాల్గొన్న అబ్బాయిగా అఖిల్ ని చూపించారు. అఖిల్ మరియు పూజా మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు ఉంది.నాకు కాబోయేవాడు నా షూస్ తో సమానం అని పూజా చెప్పిన డైలాగ్ ఆసక్తి రేపుతోంది. మ్యారీడ్ లైఫ్ గురించి నువ్వు ఏమి ఎక్స్ పెక్ట్ చేస్తున్నావ్ అని అఖిల్ అడుగగా... ఇడ్లి, వడ సాంబార్ అని పూజా చెప్పిన విధానం బాగుంది. 

దర్శకుడు భాస్కర్ పూజా హెగ్డే పాత్రను విభిన్నంగా తీర్చిదిద్దాడని అర్థం అవుతుంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తు న్న ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.