కాలం కలిసొస్తే ఏది పట్టుకున్నా బంగారమే.. ఈ లైన్ పూజా హెగ్డేకి కరెక్ట్ గా సరిపోతుంది. అసలు అమ్మడికి సక్సెస్ రేట్ కొంచెం కూడా లేకపోయినప్పటికీ ఆఫర్స్ అందుకుంటూ అందరిని ఎట్రాక్ట్ చేస్తోంది.

కాలం కలిసొస్తే ఏది పట్టుకున్నా బంగారమే.. ఈ లైన్ పూజా హెగ్డేకి కరెక్ట్ గా సరిపోతుంది. అసలు అమ్మడికి సక్సెస్ రేట్ కొంచెం కూడా లేకపోయినప్పటికీ ఆఫర్స్ అందుకుంటూ అందరిని ఎట్రాక్ట్ చేస్తోంది. సాక్ష్యం - అరవింద సమేత సినిమాలు పెద్దగా సక్సెస్ అవ్వకపోయినప్పటికీ బంపర్ ఆఫర్స్ అందుకుంటోంది. 

నెక్స్ట్ మహర్షి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ బ్యూటీ ప్రభాస్ లవ్ స్టోరీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. బన్నీ - త్రివిక్రమ్ సినిమాలో కూడా బేబీ నటించబోతోంది. ఇకపోతే ఇప్పుడు వరుణ్ తేజ్ - వాల్మీకి సినిమాకి కూడా పూజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిగర్తాండ రీమేక్ గా వస్తోన్న ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడు. 

ఒరిజినల్ కథలో లక్ష్మి మీనన్ నటించిన పాత్రలో పూజ నటిస్తోంది. ఈ సినిమా కోసం అమ్మడు కేవలం 15 రోజులు డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమిళ్ హీరో అథర్వ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్న వాల్మీకి సినిమాని రామ్ ఆచంట - గోపి ఆచంట నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సినిమాకు సంగీతాన్ని అందించనున్నాడు.