అలవాటు కాస్త ఇప్పుడు వ్యసనంగా మారింది!

pooja hegde about sun glasses
Highlights

ఒక్కొక్కరికీ ఒక్కో అలవాటు ఉంటుంది. దాన్ని మానేయాలని ఎంతగా ప్రయత్నించిగా ఫలితం 

ఒక్కొక్కరికీ ఒక్కో అలవాటు ఉంటుంది. దాన్ని మానేయాలని ఎంతగా ప్రయత్నించిగా ఫలితం మాత్రం ఉండదు. ఇక చిన్నతనం నుండి అలవాటైన పనులను ఎప్పటికీ వదిలేయలం. అవి కాస్త మనకు వ్యసనంగా మారిపోతుంటాయి.

అలా హీరోయిన్ పూజా హెగ్డేకు వ్యసనంగా మారిన విషయమేమిటంటే.. ఆమెకు కూలింగ్ గ్లాసెస్ అంటే చాలా ఇష్టం అంట. ఎక్కడకు వెళ్ళినా మొదట కోనేవి మాత్రం అవే అంటోంది ఈ బ్యూటీ. ''కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు అవసరమున్నా లేకపోయినా షాపింగ్ చేయాలనిపిస్తుంది. అక్కడ దొరికే ప్రత్యేకమైన వస్తువులను కొంటుంటాను. కానీ ఎక్కడకి వెళ్లినా.. ముందు వెతికేది మాత్రం కళ్ల జోళ్ల కోసమే.. వాటిని కొనడం ఒక వ్యసనంగా మారింది. అయినా పర్వాలేదు.. నా అందాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషించే వాటిని కొనడంలో తప్పేంలేదు'' అంటూ స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'సాక్ష్యం' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అలానే ఎన్టీఆర్ సరసన 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమా తరువాత మహేష్ బాబుతో మరో సినిమా చేయనుంది. 

loader