హీరోల మధ్య మంచి వాతావరణం ఉంటే ఒకరికొకరు సాయిం చేసుకోగలరు. అది రిలీజ్ డేట్ల సర్దుబాట్లు లేదా టైటిల్ వివాద విషయాలే కాదు, హీరోయిన్ డేట్స్ కూడా సర్దుబాటు చేసుకోవచ్చు. అయితే అందుకు హీరోలు కలిసి మాట్లాడుకుని సమస్యలు చెప్పుకుంటే జరుగుతుంది. అలాంటి సహకారమే అఖిల్ కు ప్రభాస్ నుంచి అందిందని సమాచారం.

గత కొద్ది రోజులుగా అఖిల్ సినిమా ..హీరోయిన్ లేక ముందుకు వెళ్లటం లేదు. పూజ హెడ్గే ని తన ప్రక్కన కావాలని కోరి వెయిట్ చేస్తున్నారు అఖిల్. అయితే అదే సమయంలో పూజ హెడ్గే...ప్రభాస్ తాజా చిత్రానికి డేట్స్ ఇచ్చి ఉంది. ప్రభాస్ సాహో విడుదల తర్వాత వెంటనే తదుపరి ప్రాజెక్టులోకి వెళ్లిపోదామనుకున్నారు. కానీ సాహో రిజల్ట్ తో స్క్రిప్టుని రీరైట్ చేయిస్తున్నారు. దాంతో షూటింగ్ కు  టైమ్ పట్టేటట్లు ఉంది. ఆ షూటింగ్ కోసం పూజ హెడ్గే ఇచ్చిన డేట్స్ వేస్ట్ అవుతాయి. ఈ విషయం తెలుసుకున్న అఖిల్ వెళ్లి ప్రభాస్ ని రిక్వెస్ట్ చేయటం, ఓకే డార్లింగ్ అని ప్రభాస్ ..డేట్స్ సర్దుబాటు కు సై అనటం జరిగిందిట.

అక్కినేని అఖిల్‌ రీసెంట్ గా కొత్త సినిమా ప్రారంభమైంది. బొమ్మరిల్లు భాస్కర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. గోపీ సుందర్‌ బాణీలు సమకూరుస్తున్నారు. జీఏ 2 ప్రొడక్షన్స్‌ పతాకంపై బన్నీ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పించబోతున్నారు.