ఆయన కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తోందట

ఆయన కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తోందట

కథానాయికలకు కాలం కలిసి రావడమంటే స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు రావడమే. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలోని సినిమాలను చూస్తుంటే, ఆమెకి కాలం కలిసొచ్చిందనే అనిపిస్తోంది. త్వరలో బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి 'సాక్ష్యం' సినిమాతో పలకరించనున్న ఆమె, ఎన్టీఆర్ .. మహేష్ బాబు .. ప్రభాస్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. ఈ మూడు ప్రాజెక్టులలో త్రివిక్రమ్ తో కలిసి ఎన్టీఆర్ చేస్తోన్న సినిమా సెట్స్ పైకి వెళ్లింది.

ఇటీవలే యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించిన త్రివిక్రమ్, వచ్చే నెలలో సాంగ్స్ ను చిత్రీకరించనున్నాడట. ఎన్టీఆర్ ఎంత గొప్ప డాన్సరో అందరికీ తెలిసిందే. డాన్స్ విషయంలో ఆయన స్పీడ్ ను అందుకోవడం కష్టమని ఆయనతో జోడీ కట్టిన హీరోయిన్స్ అంతా చెబుతుంటారు. అందువలన అలాంటి ఇబ్బంది లేకుండగా ఉండటం కోసం పూజా హెగ్డే డాన్స్ బాగా ప్రాక్టీస్ చేస్తోందట. ప్రస్తుతం డాన్స్ పైనే పూర్తి దృష్టి పెట్టిన ఈ సుందరి .. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి మరి.   

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos