టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతోన్న పూజ హెగ్డే తాజాగా సౌతిండియా ప్రేక్షకులపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అన్నం పెట్టిన దక్షిణాది సినిమా వారిపై ఇటువంటి వ్యాఖ్యలు చేస్తావా? అంటూ విరుచుకుపడుతున్నారు. ఆమె దక్షిణాది ప్రేక్షకులకు హీరోయిన్ల నడుమంటే పిచ్చి అని కామెంట్ చేసింది. 

హీరోయిన్లను ఎల్లప్పుడూ మిడ్ డ్రెసుల్లోనే చూడాలనుకుంటారని అంది. మంచి పేరు ఇచ్చిన దక్షిణాది సినిమాపై ఇలా విమర్శలు చేయొద్దని నెటిజన్లు ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఇక దక్షిణాదిలో ఆమెకు ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ కామెంట్స్, విమర్శలూ ఆమె దగ్గరకి చేరినట్లున్నాయి. తాజాగా ఆమె ప్రభాస్ ని పొగుడుతూ మాట్లాడి డైవర్ట్ చేసే పోగ్రాం పెట్టింది.

 ‘ప్రభాస్‌కు సిగ్గు ఎక్కువని అందుకే బయట కనిపించరని అందరూ అనుకుంటారు కానీ, ఆయన చాలా సరదాగా ఉంటారు’ అని అంటోది  పూజా హెగ్డే. వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవల ఇటలీ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పూజాహెగ్డే ఈ సినిమా గురించి మాట్లాడింది. కరోనా నేపథ్యంలో ఎన్నో జాగ్రత్తల మధ్య షూటింగ్ జరిపినట్లు తెలిపారు.  

ఇక ‘అల వైకుంఠపురములో..’ సినిమాలో కాళ్లను హైలైట్‌ చేసి చూపించడం గురించి ప్రశ్నించగా పూజా సమాధానం ఇవ్వటమే ఆమెను ఇబ్బందుల్లో పడేసింది. అల్లు అర్జున్‌ పాత్రకు హీరోయిన్ కాళ్లంటే ఇష్టమని, అతను కాళ్లను ఉద్దేశిస్తూ మాట్లాడినందుకే కష్టమైన పనులు చెప్పి శిక్షించే సీన్‌ పెట్టారని అన్నారు. అతడి తప్పులు ఎత్తి చూపిస్తూ.. నీతులు కూడా చెప్పానని, కానీ దాన్ని ఎవరూ గుర్తించలేదని పేర్కొన్నారు.

 అనంతరం దక్షిణాది ప్రేక్షకుల ఆసక్తి నాభి, నడము భాగంపైనే ఉంటుందని ఆమె చెప్పారు. సన్నివేశంలో భాగంగా కాళ్లను చూపించడాన్ని అసభ్యంగా భావించలేదని పేర్కొన్నారు. తన కాళ్లు ఆకర్షణీయంగానే ఉన్నాయని, కానీ వాటినే హైలైట్‌ చేయలేదని అన్నారు. దక్షిణాది ప్రేక్షకుల గురించి ఆమె అలా మాట్లాడిన తీరుపై కొందరు సోషల్‌ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిభను చూసి ఆదరిస్తే.. ఇలా కామెంట్‌ చేయడం సరికాదని ఆమెకు వ్యతిరేకంగా పోస్ట్‌లు పెడుతున్నారు.