దండుపాళ్యం పేరు వినగానే మనకి వొళ్ళు  వణుకు పుట్టిచ్చే సినిమా గుర్తుకువస్తుంది. దండుపాళ్యం సినిమా సూపర్ హిట్ అయింది. శ్రీనివాస్ రాజు దర్శకత్వం వహించారు మరియు కన్నడ నటి పూజ గాంధీ, మకరంద్ దేష్పాండే, రవి కాలే, రవి శంకర్ మరియు సంజన  ముఖ్యపాత్రలు పోచించారు. ఈ చిత్రం విజయవంతం కావటం తో దర్శకుడు శ్రీనివాస్ రాజు దండుపాళ్యం 2 మరియు 3 చిత్రాలు నిర్మించారు. రెండో చిత్రం కూడా విజయవంతం అయింది. దండుపాళ్యం 3 విడుదలకు సిద్ధం గా ఉంది. ఈ మూడు చిత్రాలలో పూజ గాంధీ, మకరంద్ దేష్పాండే, రవి కాలే, రవి శంకర్ మరియు సంజన నటించారు మరియు ప్రేక్షక ప్రసంశలు పొందారు.

 

ఇప్పుడు వెంకట్ అనే నిర్మాత దండుపాళ్యం 4 చిత్రాన్ని నిర్మిస్తున్నాను అని ప్రకటించాడు. నిన్న పాత్రికేయ సమావేశం పెట్టి దండుపాళ్యం 4 ప్రచార చిత్రానికుడా విడుదల చేసారు. అయితే ఈ ప్రచార చిత్రాలో 1,2,3 చిత్రాల్లో నటించిన  పూజ గాంధీ, మకరంద్ దేష్పాండే, రవి కాలే, రవి శంకర్ ముఖ చిత్రాలను విడుదల చేసారు. కానీ పూజ గాంధీ, మకరంద్ దేష్పాండే మరియు రవి కాలే మేము దండుపాళ్యం 4 చేయటం లేదు అని  వీడియో ను విడుదలచేశారు. 

 

ఆ వీడియో లో పూజ గాంధీ మాట్లాడుతూ "నేను దండుపాళ్యం 4 సినిమా  చేయటం లేదు. నన్ను ఎవరు సంప్రదించలేదు. నిన్న దండుపాళ్యం 4 చిత్రం ప్రెస్ మీట్ లో నా అనుమతి లేకుండా నా ఫొటోస్ వాడారు. నా ప్రేమేయం లేకుండా నా ఫొటోస్ ఎలా వాడతారు అని పూజ గాంధీ ప్రశ్నిస్తున్నారు. అలాగే మకరంద్ దేష్పాండే మరియు రవి కాలే కూడా దండుపాళ్యం 4 సినిమా చేయటం లేదు అని వీడియో రిలీజ్ చేసారు.