రీసెంట్ గా దండుపాళ్యం హీరోయిన్ పై పోలీస్ కేసు నమోదైనట్లు కన్నడలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఒక హోటల్ కి సంబందించిన బిల్లు విషయంలో పూజా గాంధీ ఎగ్గోట్టినట్లు వచ్చిన న్యూస్ ఒక్కసారిగా సౌత్ లో వైరల్ అయ్యింది. అయితే ఈ విషయంలో తనకు ఏ సంబంధం లేదని పూజ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. 

అసలు మ్యాటర్ లోకి వెళితే.. 2016ఏప్రిల్ లో ఒక హోటల్ లో పూజ గాంధీ ఆమె స్నేహితుడు అనిల్ పీ మీనాసినకాయ్ లు బస చేయడానికి దిగారని  2017 మార్చ్ వరకు అక్కడే ఉండి బిల్లులో మూడు లక్షల వరకు తక్కువ ఇచ్చారని కన్నడ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 26.22 లక్షల బిల్లు అయితే  22.83 లక్షలను మాత్రమే కట్టి మిగిలిన బ్యాలన్స్ అమౌంట్ అయిన 3.35 లక్షలను తరువాత ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడట. ఆ తరువాత వెంటపడితే ఇటీవల బ్యాలెన్స్ ఎమౌంట్ ను చెల్లని చెక్ రూపంలో ఇవ్వడంతో విషయం పోలీసుల వరకు వెళ్ళింది. 

పోలీసులను ఆశ్రయించిన హోటల్ యాజమాన్యం ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అయితే ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని పూజ ఆరోపిస్తోంది. ఆ హోటల్ లో అప్పుడు తాను ఉన్న మాట వాస్తవామే కానీ ఒక సినిమా డిస్కర్షన్స్ కోసం అక్కడికి వెళ్లినట్లు చెబుతూ  అనిల్ ఎవరో తనకు తెలియదని నా బిల్లు అప్పుడే క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించినట్లు పూజ తెలిపింది.