Asianet News TeluguAsianet News Telugu

నాటు నాటు పాట వెగటుపుట్టిస్తోందంటూ విమర్శలు, మండిపడిన సెలబ్రిటీ

ఆర్ఆర్ఆర్ సాధించిన విజయానికి దేశమంతా గర్విస్తోంది. ఇదే క్రమంలో.. ఈసినిమాపై  అక్కసు వెళ్లకక్కుతున్నారు కొంత మంది. ఈ విషయంలో కౌంటర్లు కూడా పడుతున్నాయి. 
 

Pooja Bhatt defends RRR after film gets trolled for its Golden Globe win
Author
First Published Jan 13, 2023, 9:42 AM IST


ఆర్ఆర్ఆర్ సాధిస్తున్న విజయాలకు.. అవార్డ్ లకు దేశం గర్విస్తున్నక్రమంలో.. కొంత మంది మాత్రం ఈసినిమాపై తమ అక్కసునంతా.. వెళ్ళదీస్తున్నారు. ముఖ్యంగా సౌత్ సినిమా ఏంటీ.. ఇంత పేరు ప్రఖ్యాతలు ఏంటి.. అని నార్త్ జనాలకు కుళ్ళు పుట్టినట్టుంది. ఆర్ఆర్ఆర్ విజయాలను వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. సినిమా అంటే బాలీవుడ్ సినిమానే గోప్ప అనే ఊహాల్లో బ్రతికేవారు తెలుగు సినిమాలుసాధిస్తున్న విజయాలను తీసుకోలేకపోతున్నారు. ఈక్రమంలోనే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సాధించిన ట్రిపుల్ ఆర్ లోని నాటు నాటు పాటపై విష ప్రచారంచేస్తున్నారు. విక్కుత పోస్ట్ లు పెడుతున్నారు. 

ఈక్రమంలో నాటునాటుపాటు బొర్ కొడుతుందని.. పాట్ చప్పగా ఉందని.. ట్రిపుల్ ఆర్ సినిమా అయితే.. మరీ యావరేజ్ గా ఉందంటూ.. కొంత మంది ట్వీట్లుపెడుతున్నారు. ఈమూవీలో యాస్..పాటలో యాస్ అయితే మరీఘోరంగా ఉంది అంటూ.. రాక్షసుల్లా నవ్వుతున్నారు. వారి సైకోమనస్తత్వాన్ని .. సోషల్ మీడియా పోస్ట్ ల రూపంలో చూపించుకుంటున్నారు. ఈక్రమంలో అలాంటివారికి కౌంటర్లు కూడా పడుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రెటీల నుంచి కౌంటర్లు తప్పడంలేదు. 

 

ఈక్రమంలో విమర్షిస్తున్న వారినోర్లు మూసుకునేలా కౌంటర్ ఇచ్చింది ప్రముఖ నటి, ప్రొడ్యూసర్, మల్టీ టాలెంటెడ్ స్టార్ పూజా భట్. ఒకరు సుఖంగా ఉన్నారంటే మనం ఓర్వలేము. మీరు చిన్నప్పటి నుంచీ ఇలాంటి బాధలోనే ఉండిపోయారా..? ఈరోగంతో బాధపడుతున్నారా..? ఒకరి సంతోషాన్ని చూసి ఓర్వలేకపోతున్నారా అంటూ మండి పడింది. అంతే కాదు ఒకరి బాధను చూసి సంతోషించగలం కాని.. ఒకరు సంతోషంగా ఉంటే మాత్రం సంతోషంగా ఉండలేము కదా.. అదే మానవ నైజంగా తయారయ్యందంటూ ఫైర్ అయ్యారు పూజా భట్. 

హాలీవుడ్ లో దాదాపు 78 ఏళ్ళుగా ఇస్తున్నారు గ్లోబల్ గోల్డ్ అవార్డ్స్. ఇప్పటి వరకూ ఇండియా నుంచీ ఏసినిమా ఆ అవార్డ్ ను సాధించలేదు. బాలీవుడ్ కూడా సాధించలేని అవార్డ్ ను తెలుగు సినిమా సాధించింది. నాటు నాటు ఓరిజినల్ సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వరించింది. దాంతో దేశం అంతా ఈ విషయంలో గర్వీస్తోంది. దేశమంతా మూవీ టీమ్ ను ప్రశంస ముంచి తేలుస్తోంది. ప్రధాని,బాలీవుడ్ సెలబ్రెటీల తోపాటు.. ముఖ్యమంత్రులు,మంత్రులు..సినీ ప్రముఖలు ఈసినిమా సాధించిన విజయంపై ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios