కమల్ హాసన్ కు షాక్ ఇచ్చాడు మణిరత్నం. చాలా కాలంగా సైలెంట్ గా ఉన్న తమిళ పరిశ్రమకు రీసెంట్ గా విక్రమ్ సినిమాతో ఊపు వచ్చింది.. ఆరువాత పొన్నియన్ సెల్వన్ సినిమాతో పరిగెత్తే ఎనర్జీ వచ్చేసింది. ఇక రీసెంట్ గా విక్రమ్ కు షాక్ ఇచ్చింది పొన్నియన్ సెల్వన్.
కమల్ హాసన్ విక్రమ్ తో పాటు.. మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమాతో తమిళ పరిశ్రమకు మంచి ఊపు వచ్చింది. కమల్ కు అయితే ఆయన కెరీర్ లోనే ఎప్పుడు సాధిచలేని కలెక్షన్స్ సాధించి పెట్టగా.. గత కొన్నేళ్ళుగా కమర్షియల్ హిట్టు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న మణిరత్నంకు పొన్నియన్ సెల్వన్ మంచి బ్రేక్ ఇచ్చింది. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 30న రిలీజైన పొన్నియన్ సెల్వన్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను సాధిస్తుంది. తమిళ సినిమా చరిత్రలో నలిచిపోయిందీ మూవీ.
తమిళ ఫేమస్ రైటర్ కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించాడు మణిరత్నం. ఇక ఈ సినిమాలో మణిరత్నం టేకింగ్, యాక్టర్ల పర్‌ఫార్మెన్స్ ఆడియన్స్ ను ఫిదా చేసింది. అవ్వడానికి తమిళ కథే అయినా.. అన్ని భాషల్లో ఆడియన్స్ కు బాగాకనెక్ట్ అయ్యింది పొన్నియన్ సెల్వన్. కాని ఈ సినిమాను తమిళ ఆడియన్స్ ఆధరించినంతగా ఇతర భాషల్లో ఆడియన్స్ ఆధరించలేకపోయారు. కలెక్షన్స్ విషయంలో కూడా తమిళంలోనే ఎక్కువగా సాధించింది ఈ సినిమా.
అంతే కాదు రీసెంట్ గా కమల్ హాసన్ విక్రమ్ సినిమాకు కూడా షాక్ ఇచ్చింది పొన్నియన్ సెల్వన్. విక్రమ్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. తాజాగా తమిళనాడులో పొన్నియన్ సెల్వన్ మూవీ విక్రమ్ సినిమా కలెక్షన్స్ ను దాటేసి హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఒక రకంగా చూసుకుంటే కమల్ విక్రమ్ బడ్జెట్ వేరు.. ఈసినిమా బడ్జెట్ వేరు. కాని ఎలా చూసుకున్నా.. ఇద్దరు పెద్ద స్టార్ల సినిమాలు పోటీపడ్డాయన్నట్టే తెలుస్తుంది. ఇక కలెక్షన్స్ సంగతి చూసుకుంటే.. ఇక ఇప్పటి వరకు పొన్నియన్ సెల్వన్ తమిళనాడులో 185 కోట్ల వరకు గ్రాస్‌ను కలెక్ట్ చేయగా.. విక్రమ్ సినిమా 172 కోట్ల వరకు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.
ఇప్పటి వరకూ తమిళంలో ఇంత కలెక్షన్ సాధించిందిన సినిమా అంటే అది 2.o అని చెప్పాలి. ఈలెక్కన చూసుకుంటే.. పొన్నియన్ సెల్వన్ సినిమా ఇదే జోష్ చూపిస్తే.. త్వరలోనే రోబో 2.0 రికార్డ్స్ ను కూడా క్రాస్ చేసి.. బ్రేక్ చేసే అవకాశం ఉన్నట్టు సినిమా పండితులు విశ్లేషిస్టున్నారు. మణిరత్నం చాలా ఏళ్ళ కష్టానికి.. స్టార్ కాస్ట్ తోడై ఈసినిమా అనుకున్న అవుట్ పుట్ వచ్చింది. ఈ మూవీలో చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, బాబీ సింహా లాంటి స్టార్లు నటించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి మణిరత్నం స్వయంగా తెరకెక్కించారు. తెలుగులో ఈసినిమాను దిల్ రాజు రిలీజ్ చేశారు.
