Asianet News TeluguAsianet News Telugu

నేడు పొన్నియిన్ సెల్వన్ 2 పై కీలక అప్డేట్! 

మణిరత్నం పీరియాడిక్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ ఆదరణ దక్కించుకుంది. ఈ క్రమంలో సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. దీనిపై నేడు అప్డేట్ రానుంది. 
 

ponniyin selvan 2 update today movie lovers  waiting for it
Author
First Published Dec 28, 2022, 1:00 PM IST

మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ మంచి విజయం సాధించింది. ఇతర భాషల్లో పెద్దగా ప్రభావం చూపకపోయినా... కోలీవుడ్ ప్రేక్షకులు చిత్రాన్ని అమితంగా ఇష్టపడ్డారు. వరల్డ్ వైడ్ పొన్నియిన్ సెల్వన్ దాదాపు రూ. 500 కోట్ల వసూళ్లు సాధించింది. పార్ట్ 1 కి మణిరత్నం ఆసక్తికర ముగింపు ఇచ్చారు. దీంతో సీక్వెల్ పై అంచనాలు ఏర్పడ్డాయి. అభిమానులు పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 కొరకు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 

మొదటి భాగంతో పాటు రెండవ భాగం షూట్ కూడా చాలా వరకు పూర్తి చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో 2023లో పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 విడుదల కానుందని సమాచారం. కాగా నేడు పొన్నియిన్ సెల్వన్ 2 పై అప్డేట్ రానుంది. సాయంత్రం 4:00 గంటలకు అప్డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ తెలియజేశారు. పొన్నియిన్ సెల్వన్ 2 అప్డేట్ కొరకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈచిత్రంలో విక్రమ్, కార్తీ, జయం రవి, విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలు చేశారు. ఐశ్వర్య రాయ్, త్రిషా, శోభిత దూళిపాళ్ల లీడింగ్ లేడీ క్యారెక్టర్స్ పోషించారు. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, పార్తీబన్, జయరామ్ కీలక రోల్స్ లో నటించారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా పొన్నియిన్ సెల్వన్ సిరీస్ తెరకెక్కుతుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios