Asianet News TeluguAsianet News Telugu

ఇలాంటి చెత్త సినిమాలు చేయకు.. మహేష్‌ బాబుకి పొలిటీషియన్‌ వార్నింగ్‌..

మహేష్‌ బాబు సినిమాలకు వాళ్ల నాన్న కృష్ణ రివ్యూ ఇస్తుంటారు. కానీ ఆయన కాకుండా మరో స్పెషల్‌ పర్సన్‌ ఫీడ్‌ బ్యాక్ ఇస్తారట. ఆయన వార్నింగ్‌ని గుర్తు చేసుకున్నారు మహేష్‌.
 

political leader warning to mahesh babu after watching aagadu movie arj
Author
First Published Jul 22, 2024, 11:32 PM IST | Last Updated Jul 23, 2024, 8:04 AM IST

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు తన కెరీర్‌లో చాలా సూపర్ హిట్లు, బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలున్నాయి. అదే సమయంలో `అతిథి`, `సైనికుడు`, `ఖులేజా`, `ఆగడు`, `బ్రహ్మోత్సవం` వంటి డిజాస్టర్‌ సినిమాలు కూడా ఉన్నాయి. కానీ `మురారీ`, `ఒక్కడు`, `పోకిరి`, `బిజినెస్‌ మేన్‌`, `దూకుడు`, `శ్రీమంతుడు`, `భరత్ అనే నేను`, `మహార్షి`, `సరిలేరు నీకెవ్వరు` వంటి హిట్‌ చిత్రాలతో స్టార్‌గా ఎదిగారు మహేష్‌. చాలా మంది హీరోలు పాన్‌ ఇండియా అంటూ వెళ్లినా, మహేష్‌ బాబు లోకల్ అనిపించుకున్నాడు. ఇప్పటి వరకు అలానే చేశాడు. 

కానీ ఇప్పుడు పాన్‌ ఇండియా కాదు, ఏకంగా పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు. రాజమౌళి.. మహేష్‌తో ఏకంగా ఇంటర్నేషనల్‌ రేంజ్‌ ఫిల్మ్ ని తెరకెక్కించేందుకు సన్నద్దమవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుంది. ఈ సినిమా ఈ ఏడాది ఎండింగ్‌ వరకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం మేకోవర్‌ అవుతున్నాడు మహేష్‌. సరికొత్తగా కనిపించబోతున్నాడు. హెయిర్‌ స్టయిల్‌ కూడా మార్చేశాడు. హాలీవుడ్‌ స్టార్‌ రేంజ్‌లో కనిపిస్తున్నాడు. 

ఇక మహేష్‌ పర్సనల్‌ విషయాలకు వస్తే.. ఆయన నటించిన సినిమాలను తండ్రి సూపర్‌ స్టార్‌ కృష్ణ చూసి రివ్యూ చెప్పేవారు. ఆయనే పెద్ద క్రిటిక్‌ అని, బాగాలేకపోతే చెప్పేవాడు కాదు, బాగుంటేనే ఓకే బాగుందని చెబుతుంటాడని మహేష్‌ చాలా సందర్భాల్లో తెలిపారు. కృష్ణ బాగుందంటే అది అద్భుతంగా ఉందనుకోవచ్చన్నారు. అయితే ఫాదర్‌ కాకుండా మహేష్‌కి రివ్యూ చెప్పే మరో వ్యక్తి ఉన్నాడట. ఆయన సినిమాలకు సంబంధించిన వ్యక్తి కాదు, రాజకీయ నాయకుడు. 

political leader warning to mahesh babu after watching aagadu movie arj

మహేష్‌ సినిమాని కచ్చితంగా ఆయన చూస్తాడట. రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా సినిమా చూస్తాడని, ఆయన మూవీ చూస్తున్నాడంటే మహేష్‌కి భయమట, ఏం చెబుతాడో అని. ఆయన ఎవరో కాదు మాజీ మంత్రి కేటీఆర్‌. మహేష్‌, కేటీఆర్‌ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. తరచూ కలుస్తుంటారు. అయితే `ఆగడు` సినిమా చూసి కేటీఆర్‌ ఫోన్‌ చేశాడట. ఆయన స్పందనకి షాక్‌ అయ్యాడట మహేష్‌. ఓ రకంగా భయపడ్డాడట. `ఏంటీ మహేష్‌ ఇలాంటి చెత్త సినిమాలకు చేయోద్ద`ని చెప్పేశాడట. మొఖం మీదనే ఆ మాట అనేసరికి తాను చాలా ఫీల్‌ అయ్యాడట. కేటీఆర్‌ సినిమాలు చూస్తే తనకు టెన్షన్‌ అని, ఎందుకంటే బాగుంటేనే బాగుందని చెబుతాడని, లేదంటే అస్సలు చెప్పడని, కానీ `ఆగడు` సినిమా చూసి ఇలాంటి చెత్త సినిమాలు ఆపేయ్‌ అంటూ వార్నింగ్‌ ఇచ్చాడట. అలాంటి మంచి స్నేహితుడు కేటీఆర్‌ అని చెప్పారు మహేష్‌. `భరత్‌ అనేనేను` సమయంలో ఓ ఇంటర్వ్యూలో మహేష్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios