ఓ బాధితరాల తరపన పోలీస్ స్టేషన్ కు వెళ్లిన శ్రీరెడ్డి కి పోలీసులు షాక్ ఇచ్చారు. శ్రీశాంత్ రెడ్డి అనే వ్యక్తి కో ఆర్డినేటర్ గా పని చేస్తున్నాడు. అతనికి ఓ జూనియర్ ఆర్టిస్ట్ పరిచయమయ్యింది. ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ కుదరడంతో బోరబండ లోని తన ఇంటికి తీసుకెళ్లాడట. అక్కడ చాలా సార్లు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేశాడని ఆ ఆర్టిస్ట్ ఆరోపిస్తుంది. అంతేకాదు తన దగ్గర ఉన్న డబ్బుకూడా లాక్కొని పారిపోయాడట. ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పెట్టింది. వాట్సప్ లో జూనియర్ ఆర్టిస్ట్ తో పాటు కో ఆర్డినేటర్స్ సర్కిల్ లో తిరుగుతోంది. ఇది అంతా అబద్దమని తన పరువు తీస్తోందని బంజారహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వచ్చాడు  శ్రీశాంత్ రెడ్డి . 

ఫిర్యాదు రాస్తున్న సమయంలోనే శ్రీరెడ్డి తో కలసి అదే టైం కి స్టేషన్ కి వచ్చింది. ఆమెతో పాటు మరికొంతమంది ఆర్టిస్ట్ లు ఉన్నారు. శ్రీరెడ్డి సపోర్ట్ చూసుకొని ఒక్కసారిగి శ్రీశాంత్ రెడ్డి పై దాడి చేసింది. ఇటు శ్రీరెడ్డి తో పాటు మిగతా మహిళలు కూడా  శ్రీశాంత్ రెడ్డి మీద దాడికి దిగారని సమాచారం. ఇంతలోనే పోలీసులు అడ్డుకున్న కూడా వాళ్లు ఏమాత్రం తగ్గలేదు. ఒక మహిళ ఏకంగా ఎస్ఐ టేబుల్ ఎక్కి మరి దాడి చేసింది. ఆ మహిళల ఓవర్ యాక్షన్ చూసి పోలీసులే షాక్ అయ్యారు. 

వాళ్లని దాడి చేయద్దని వార్నింగ్ ఇచ్చిన పోలీలసుల మాటలు పట్టించుకోలేదు అంతటితో ఆగకుండా పోలీసులతో వాగ్వాదంకు దిగారు. అందులో ఒక మహిళ పోలీసులనే తిట్టి దాడిగి దిగింది దాంతో పోలీసులు కూడా షాక్ అయ్యారు. చివరకు పోలీసులు సీరియస్ అవడంతో బయటకు వచ్చి  శ్రీశాంత్ రెడ్డి  తమకు అప్పగించాలని ఆందోళనకు దిగారు. మహిళల తీరుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేసారు. న్యాయ్ం కోసం వచ్చివాళ్లు కనీసం మేం చెప్పే మటలైన వినాలి ఫిర్యదు ఇవాలి. ఇలా దాడి చేయడం చట్ట వ్యతిరేకం అని అంటున్నారు పోలీసులు. తరువాత శ్రీరెడ్డి జూనియర్ ఆర్టిస్ట్ ఫిర్యదు తీసుకొని పంపించేశారని సమాచారం. పోలీసులపై దురుసుగా ప్రవర్తించినందుకు దుర్బాషలాడినందుకు శ్రీరెడ్డిపై కేసు పెట్టేందుకు సీసీటీవీ ఫూటేజ్ లు ఆధారాలు సేకరిస్తున్నారని తెలుస్తుంది. ఆమెతో పాటు అక్కడ గొడవ చేసిన మహిళలందరిపై కేసు నమోదు చేయడానికి రంగం సిద్ధమైంది.