Asianet News TeluguAsianet News Telugu

స్నేహితుడిని మోసం.. హీరో సచిన్‌ జోషీపై కేసు నమోదు..

టాలీవుడ్‌, బాలీవుడ్‌లో అడపాదడపా సినిమాలు చేస్తూ హీరోగా రాణిస్తున్న సచిన్‌ జోషి తన స్నేహితుడు పరాగ్‌ సంఘ్వితో కలిసి వైకింగ్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీని రన్‌ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఓ ఒప్పందం జరిగింది. 
 

police fir filled on hero sachiin joshi  arj
Author
Hyderabad, First Published Jan 10, 2021, 8:43 PM IST

హీరో సచిన్‌ జోషీపై కేసు నమోదైంది. పుణెలోని ఓ పోలీస్‌ స్టేషన్‌లో ఆయన స్నేహితుడు పరాగ్‌ సంఘ్వి ఫిర్యాదు చేశారు. చెల్లింపుల విషయంలో తలెత్తిన వివాదం విషయంలో పరాగ్‌ సంఘ్వి.. సచిన్‌ జోషిపై ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. టాలీవుడ్‌, బాలీవుడ్‌లో అడపాదడపా సినిమాలు చేస్తూ హీరోగా రాణిస్తున్న సచిన్‌ జోషి తన స్నేహితుడు పరాగ్‌ సంఘ్వితో కలిసి వైకింగ్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీని రన్‌ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఓ ఒప్పందం జరిగింది. 

ఈ ఒప్పందం ప్రకారం ఇంటర్నేషనల్‌ రిసార్ట్ కోరేగావ్‌ పార్క్‌కు రూ.58కోట్లు రాయల్టీ చెల్లించాల్సి ఉంది. కానీ 2016 నుంచి పరాగ్‌ సంఘ్వికి సచిన్‌ జోషి ఎలాంటి చెల్లింపులు చేయలేదు. దీనిపై అతను పుణె పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘ్వి ఫిర్యాదు మేరకు పుణె పోలీస్‌ క్రైమ్‌ బ్రాంచ్‌కి చెందిన ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు చేస్తుంది. ఈ దర్యాప్తులో భాగంగా జోషిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మరోవైపు వైకింగ్‌ మీడియా అండ్‌ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి సంస్థలో పనిచేసే ముప్పై మంది మాజీ ఉద్యోగులకు సచిన్‌ జీతాలు ఇవ్వలేదనే ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు ఆ మధ్య గుట్కా అక్రమ రవాణా చేస్తున్నారనే ఆరోపణల్లో హైదరాబాద్‌ పోలీసులు సచిన్‌ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 

`మౌనమేలనోయి` చిత్రంతో హీరోగా తెలుగు తెరకి పరిచయమైన సచిన్‌ జోషి `నిను చూడక నేనుండలేను`, `ఒరేయ్‌ పండు` వంటి చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత హిందీలో `ఆజాన్‌`, `ముంబయి మిర్రర్‌`, `జాక్‌పాట్‌` చిత్రాలు చేశాడు. మళ్లీ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చి `నీ జతగా నేనుండాలి`, `మొగలిపువ్వు`, `వీరప్పన్‌`, `వీడెవడు`, `అమవాస్‌` చిత్రాల్లో నటించాడు. `వీడెవడు` మంచి విజయం సాధించింది. `నెక్ట్స్ ఎంటీ` చిత్రానికి నిర్మాతగా పనిచేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios