విజయ్ దేవరకొండ చిక్కుల్లో పడ్డారు. తనదైన బోల్డ్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచే ఆయన ఇప్పుడు ఓ కేసులో ఇరుక్కున్నారు. ఆదివాసీలను అవమానించారంటూ లాయర్ విజయ్ దేవరకొండపై ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తన మాటలతో అందరిని ఆకట్టుకుంటాడు. అదే సమయంలో ఆయన మాటలు కొన్నిసార్లు వివాదంగానూ మారుతుంటాయి. ట్రోల్స్ కి గురవుతుంటాయి. కానీ తాజాగా విజయ్ దేవరకొండ ఓ వివాదంలో ఇరుక్కున్నారు. ఆయనపై కేసు నమోదు కావడం గమనార్హం. హైదరాబాద్‌లోని ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో విజయ్‌పై కంప్లెయింట్ నమోదైంది.
విజయ్ దేవరకొండ ఇటీవల సూర్య నటించిన `రెట్రో` మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరయ్యారు. ఇందులో ఆయన ఆదివాసీలను అవమానించారంటూ కిషన్ లాల్ చౌహాన్ అనే లాయర్ ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కంప్లెయింట్‌ని తీసుకుని విజయ్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఈ ఫిర్యాదుని పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచ
Scroll to load tweet…


