Asianet News TeluguAsianet News Telugu

హీరో ప్రభాస్ పై పోలీస్ కేసు నమోదు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై పోలీసు కేసు నమోదైంది. హైదరాబాద్ రాయదుర్గం పీఎఎస్ లో రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసినట్లు సమాచారం. ఈ మేరకు  ఇవాళ(జూన్ 9,2020) కూకట్ పల్లి కోర్టులో ట్రయిల్ జరగనుంది.  రాయదుర్గంలోని సర్వే నెంబర్ 46లోని 84 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించి 40 ఏళ్లుగా వివాదం నడుస్తోంది. ఇదే సర్వే నెంబర్‌లో 2,200 గజాల్లో ప్రభాస్ గెస్ట్ హౌస్ నిర్మించుకున్నాడు.

Police case on young rebel Star Prabhas
Author
Hyderabad, First Published Jun 9, 2020, 4:00 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై పోలీసు కేసు నమోదైంది. హైదరాబాద్ రాయదుర్గం పీఎఎస్ లో రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసినట్లు సమాచారం. ఈ మేరకు  ఇవాళ(జూన్ 9,2020) కూకట్ పల్లి కోర్టులో ట్రయిల్ జరగనుంది.  రాయదుర్గంలోని సర్వే నెంబర్ 46లోని 84 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించి 40 ఏళ్లుగా వివాదం నడుస్తోంది. ఇదే సర్వే నెంబర్‌లో 2,200 గజాల్లో ప్రభాస్ గెస్ట్ హౌస్ నిర్మించుకున్నాడు.

 జీవో నెంబర్ 59 కింద దీన్ని క్రమబద్ధీకరించాలని దరఖాస్తు కూడా చేసుకున్నాడు. అయితే ఆ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా గుర్తిస్తూ గతంలోనే శేరిలింగంపల్లి తహసీల్దార్ స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ సమయంలో తన గెస్ట్ హౌస్ లోకి ప్రవేశించేందుకు ప్రభాస్ యత్నించాడని రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి కూకట్ పల్లి కోర్టులో ట్రయల్ జరగనుంది. 

ఇక  ఆ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా గుర్తిస్తూ గతంలోనే శేరిలింగంపల్లి తహసీల్దార్ వాసుచంద్ర స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ప్రభుత్వ స్థలాన్ని ఇతరులు అన్యాక్రాంతం చేసి ప్రభాస్ కు అమ్మారని అందుకే తిరిగి ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని తహసీల్దార్ అంటున్నారు. కాగా, తన గెస్ట్ హౌజ్ ని అధికారులు సీజ్ చేయడంతో దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు ప్రభాస్. రెగ్యులరైజ్ చేస్తే ఆ గెస్ట్ హౌస్ తిరిగి ప్రభాస్ కు సొతం అవుతుంది లేదంటే ఆ కట్టడాన్ని అధికారులు కూల్చేస్తారని సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios