ఈ ‘‘షార్ట్ ఫిల్మ్’’ ని నిషేధించండి

police case against bhrammanula ammai navabula abbai short film
Highlights

మండిపడుతున్న బ్రాహ్మణ సంఘాలు

సినిమాల్లో తమ మనోభావాలను కించపరిచారంటూ కొన్ని సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే.. ఇప్పుడు ఇలాంటి అభ్యంతరమే ఓ షార్ట్ ఫిల్మ్ పై వ్యక్తమౌతున్నాయి.

సినిమాలమీద ఇంట్రెస్ట్ ఉన్న చాలా మంది షార్ట్ ఫిల్మ్ లను తీస్తూ.. తమ టాలెంట్ ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. తాజాగా ఓ షార్ట్ ఫిల్మ్ టీజర్ ని యూట్యూబ్ లో విడుదల చేయగా.. దానిపై బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి.

హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి ప్రేమకథగా ఈ షార్ట్ ఫిల్మ్ ని తెరకెక్కిస్తున్నారు.  అయితే.. ‘బ్రాహ్మణ సమాజాన్ని కించపరచే విధంగా లవ్ జీహాద్ ను ప్రేరేపించే విధంగా నిర్మిస్తున్న ‘బ్రాహ్మణుల అమ్మాయి నవాబుల అబ్బాయి’ లఘు చిత్రాన్ని విడుదల కాకుండా ఆపాలని...సినిమా ట్రయిలర్‌ను యూట్యూబ్ నుంచి సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోరుతున్నారు.

 

వివాదాస్పద లఘు చిత్రాన్ని తెరకెక్కించిన చిత్ర బృందంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శాంతినగర్‌ ప్రాంతానికి చెందిన విశాల్‌, లాలాగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈ రోజు (బుధవారం) రీజినల్‌ సెన్సార్‌ బోర్డ్‌ ఆఫీసర్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిలను కలిసి షార్ట్‌ ఫిలింను నిషేదించాల్సిందిగా కోరనున్నారు. షార్ట్‌ఫిలింను తెరకెక్కించిన దర్శకుడు ఫారుఖ్‌ రాయ్‌, నిర్మాత చంచల్‌ శర్మలతో పాటు ఇతర చిత్ర బృందంపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
 

loader