నటి తారాచౌదరిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన తన బంధువు రాజ్ కుమార్ ఇప్పుడు తప్పించుకు తిరుగుతున్నాడని గతవారం ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు రాజ్ కుమార్ ని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు చెబుతోన్న వివరాల ప్రకారం.. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, నవోదయ కాలనీలో నివాసముంటోన్న ఆర్ రాజేశ్వరి అలియాస్ తారా చౌదరికి 2016 నవంబర్ లో సమీప బంధువు రాజ్ కుమార్ తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో అతడిని పెళ్లి చేసుకోవాలని రాజ్ కుమార్ సోదరి సుజాత తారా చౌదరిని అడగడంతో దానికి ఆమె రాజ్ కుమార్ కి ఇదివరకే వివాహమైంది కదా అని ప్రశ్నించగా.. విడాకులు తీసుకున్నాడని నమ్మించారు.

మొదట్లో రాజ్ కుమార్ తో పెళ్లి నిరాకరించిన తారా చౌదరి ఆ తరువాత పెళ్లికి అంగీకరించింది. ఇద్దరూ కలిసి హైదరాబాద్ నుండి విజయవాడకి వెళ్లిపోయారు. అక్కడకి వెళ్లిన తరువాత రాజ్ కుమార్ ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని, తారా చౌదరి పేరు మీదున్న ల్యాండ్ అమ్మాలని అడిగాడు.

దానికి ఆమె ఒప్పుకోకపోవడంతో తిరిగి హైదరాబాద్ కి వచ్చేశాడు. తనతో కొన్నిరోజులు సహజీవనం చేసిన అతడు ఇప్పుడు పెళ్లి మాట ఎత్తుతుంటే తప్పించుకు తిరుగుతున్నాడని  ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా రాజ్ కుమార్ ని అదుపులోకి తీసుకున్నాడు.