సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం దక్కిన విషయం తెలిసిందే. గురువారం కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రిప్రకాష్‌ జవదేకర్‌ ఈ అత్యున్నత పురస్కరాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ తాజాగా రజనీకి అభినందనలు తెలిపారు. రజనీ చేసిన సేవలను గుర్తు చేస్తూ ఆయనకు విషెస్‌ తెలిపారు. 

`తరతరాలుగా ప్రాచుర్యం పొందిన వారిగా కొంతమందినే గొప్పగా చెప్పుకోవచ్చు. విభిన్నమైన పాత్రలు, అద్భుతమైన వ్యక్తిత్వం కలిసి రజనీకాంత్‌గారు అందులో ఒకరు. భారతీయ సినిమాకి విశేషమైన సేవలందించిన తలైవాకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు లభించడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయనకు అభినందనలు` అని తెలిపారు ప్రధాని నరేంద్రమోడి. 

దీంతో అనేక మంది సినీ తారలు రజనీకాంత్‌కి అభినందనలు తెలియజేస్తున్నారు. అదే సమయంలో పలు విమర్శలు వినిపిస్తున్నాయి. తమిళనాడు ఎన్నికలు ముందు రజనీకాంత్‌కి ఈ అవార్డుని ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రజనీకి తమిళనాట భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇది ఎన్నికల్లో ఓట్ల గేమ్‌ అని, ఓటుకి, అవార్డుతో ముడిపెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి.