బాలీవుడ్ గాన కోకిల ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. దీంతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఆమె మరణవార్త విన్న ప్రధాని నరేంద్ర మోడీ లతాజీకి నివాళి అర్పించారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా తమ సానుభూతి వ్యక్తం చేశారు.
లతాజీ మరణవార్త తెలిసిన దేశ ప్రజలంతా శోశసంద్రంలో మునిగిపోయారు. అటు చిత్ర ప్రముఖులు, ఇటు రాజకీయ నాయకులు కూడా చింతిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థనలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా లతాజీ మరణంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ నివాళి అర్పించారు.
‘ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మరణంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి. నేను చెప్పలేనంత వేదనలో ఉన్నాను. దయ, శ్రద్ధగల లతా దీదీ మమ్మల్ని విడిచిపెట్టారు. ఆమెతో నా పరస్పర చర్యలు మరువలేనివి. లతా దీదీ మరణించినందుకు నా తోటి భారతీయులతో నేను బాధపడ్డాను. ఆమె దేశంలో పూరించలేని శూన్యాన్ని మిగిల్చింది. రాబోయే తరాలు ఆమెను భారతీయ సంస్కృతికి ధీటుగా గుర్తుంచుకుంటాయి’ అంటూ మోడీ ట్వీట్.
మరోవైపు ఆమె అభిమానులు చాలా బాధపడుతున్నారు. లతాజీ లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె పాటలను, ఔన్నత్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఆమె లేని లోటు తీర్చలేనిది అంటూ సోషల్ మీడియా వేదికన ఆవేదన చెందుతున్నారు. మరోవైపు సినీ ప్రముఖులు కూడా చింతిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ‘రెస్ట్ ఇన్ పీస్ లతాజీ. భారతీయ సంగీతానికి లెజెండ్ సింగర్ లేరు’ అంటూ తన సోషల్ మీడియా వేదికన పేర్కొన్నారు. ఈ మేరకు ఏఆర్ రెహమాన్ అభిమాని లతాజీతో ఏఆర్ రెహమాన్ దిగిన కొన్ని ఫొటోలను పోస్ట్ చేశాడు.
