పూజ హెగ్డే రీసెంట్ గా సౌతిండియా ప్రేక్షకులపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అన్నం పెట్టిన దక్షిణాది సినిమా వారిపై ఇటువంటి వ్యాఖ్యలు చేస్తావా? అంటూ విరుచుకుపడుతున్నారు. ఆమె దక్షిణాది ప్రేక్షకులకు న‌డుమంటే వ్యామోహం అని, హీరోయిన్ల‌ను మిడ్ డ్ర‌స్‌ల‌లో చూడ‌టానికి ఇష్ట‌ప‌డ‌తార‌ని చెప్పుకొచ్చారు. 

మంచి పేరు ఇచ్చిన దక్షిణాది సినిమాపై ఇలా విమర్శలు చేయొద్దని నెటిజన్లు ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఇక దక్షిణాదిలో ఆమెకు ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ కామెంట్స్, విమర్శలూ ఆమె దగ్గరకి చేరాయి. పరిస్దితి విషమించకముందే మేలుకుని పూజా హెగ్డే స్పందించారు. 

తాను ఇంట‌ర్వ్యూలో అన్న మాట‌ల‌ను వేరే సంద‌ర్భానికి అన్వ‌యిస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అక్ష‌రాన్ని మార్చ‌గ‌ల‌రేమో కానీ అభిమానాన్ని కాద‌ని చెప్పుకొచ్చారు. త‌న‌కు తెలుగు చల‌న‌చిత్ర పరిశ్ర‌మ ఎప్ప‌టికీ ప్రాణ స‌మానమ‌ని స్ప‌ష్టం చేశారు. ఇది త‌న చిత్రాల‌ను అభిమానించే వారికీ, త‌న అభిమానుల‌కు తెలిసినా.. ఎటువంటి అపార్థాల‌కు తావివ్వ‌కూడ‌ద‌నే మ‌ళ్లీ చెబుతున్నాన‌ని చెప్పుకొచ్చారు. త‌న‌కు ఎంతో పేరు ప్ర‌ఖ్యాత‌లు తెచ్చిపెట్టిన తెలుగు ఇండ‌స్ట్రీకి ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను అని ఓ లేఖ‌ను విడుద‌ల చేశారు. త‌న ఇంట‌ర్వ్యూను మొత్తం చూస్తే మీకే అన్నీ అర్థ‌మ‌వుతుంద‌ని స‌ల‌హా ఇచ్చారు.