Asianet News TeluguAsianet News Telugu

షూటింగ్‌ లొకేషన్‌లో హర్రర్‌ ఎలిమెంట్లు.. షాకింగ్‌ విషయాలు వెల్లడించిన `పిండం` ప్రొడ్యూసర్‌..

హర్రర్‌ ఎలిమెంట్లతో ప్రస్తుతం `పిండం` అనే చిత్రం రూపొందింది. వచ్చే వారంలో థియేటర్లోకి రానుంది. ఈ హర్రర్‌ థిల్లర్‌ షూటింగ్‌ సమయంలోనూ కూడా హర్రర్‌ ఎలిమెంట్లు కనిపించలేదట. 

pindam producer revealed horror elements happens in shooting stage arj
Author
First Published Dec 2, 2023, 11:31 PM IST

హర్రర్‌, థ్రిల్లర్‌ సినిమాలకు ఒక సెపరేట్‌ ఆడియెన్స్ ఉంటారు. మంచి సినిమాలకు, కంటెంట్‌ ఉన్న సినిమాలను ఆదరిస్తూ పెద్ద విజయాలను అందిస్తున్నారు. ఇటీవల సరైన హర్రర్‌ సినిమాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా `పిండం`అనే మూవీ వస్తోంది. గర్భస్త పిండం ప్రధానంగా రూపొందుతున్న చిత్రమిది. హర్రర్‌, థ్రిల్లర్‌ యాక్షన్‌ మూవీగా ఇది రూపొందుతుంది. ఇందులో శ్రీరామ్‌ హీరోగా నటించగా, ఖుషీ రవి ఆయనకు జోడీగా చేసింది. `ది స్కేరియస్ట్ ఫిల్మ్` అనే క్యాప్షన్‌తో రాబోతుంది. 

ఈ సినిమాకి సాయికిరణ్‌ దైదా దర్శకత్వం వహిస్తుండగా, కళాహి మీడియా పతాకంపై యశ్వంత్ దగ్గుబాటి నిర్మించారు. డిసెంబర్‌ 15న సినిమా విడుదల కాబోతుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా తాజాగా నిర్మాత యశ్వంత్‌ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమాలో హర్రర్‌ ఎలిమెంట్లు ఉన్నట్టుగానే సినిమా షూటింగ్‌లోనూ హర్రర్‌ ఎలిమెంట్లు చోటు చేసుకున్నాయట. ఒకరు ఫిట్స్ వచ్చి పడిపోయారు. ఒకరికి కాలు విరిగింది. ఒకసారి సెట్ లోకి పాము వచ్చింది. ఇంకోసారి ఈశ్వరి రావు తలకి గాయమైంది. అలాగే ఒకసారి ఆదివారం అమావాస్య అని తెలియకుండా అర్ధరాత్రి షూటింగ్ ప్లాన్ చేశాం. చైల్డ్ ఆర్టిస్ట్ వాళ్ళ మదర్ వచ్చి అమావాస్య అర్ధరాత్రి అని భయపడుతుంటే, దగ్గరలోని గుడి నుంచి కుంకుమ తెప్పించి అందరికీ బొట్లు పెట్టించామ`ని చెప్పారు. 

సినిమా గురించి చెబుతూ, `పిండం` అనే టైటిల్‌ పెట్టినప్పుడు అందరి లాగానే మేము కూడా మొదట టైటిల్ విని ఆశ్చర్యపోయాము. అయితే ఒక జీవి జన్మించాలంటే పిండం నుంచే రావాలి. మరణం తర్వాత పిండమే పెడతారు. జననంలోనూ, మరణంలోనూ ఉంటుంది కాబట్టి పిండం టైటిల్ పెట్టడంలో తప్పేముంది? సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకి కూడా మనం ఈ టైటిల్ ఎందుకు పెట్టామో అర్థమవుతుందని దర్శకుడు చెప్పారు.  

దర్శకుడు గురించి చెబుతూ, `దర్శకుడు నాకు మంచి స్నేహితుడు. వ్యాపారాల్లో కూడా భాగస్వామిగా ఉన్నాడు. అతను మంచి బిజినెస్ మేన్, అలాగే మంచి దర్శకుడు కూడా. 2014-15 సమయంలో నాకు పరిచయమయ్యాడు. అప్పటి నుంచే కథలు రాసుకునేవాడు. ఎప్పటికైనా దర్శకుడు అవ్వాలని చెప్పేవాడు. ఏళ్ళు గడుస్తున్నా అదే పట్టుదలతో ఉన్నాడు. మొదట సిద్ధు జొన్నలగడ్డతో ఓ క్రైమ్ కామెడీ సినిమాని డల్లాస్ లో చేయాలని సన్నాహాలు చేశాము. కానీ అదే సమయంలో కోవిడ్ రావడంతో వాయిదా పడింది. ఆ తర్వాత అందరూ ఇతర ప్రాజెక్ట్ లతో బిజీ అయ్యారు. అప్పుడు వేరే సినిమా చేద్దాం అనుకున్నప్పుడు, అతికొద్ది సమయంలోనే దర్శకుడు ఈ పిండం కథని రాశాడు. ఇది చాలా అద్భుతమైన కథ. ఇది ప్రస్తుతం, 1990 లలో, 1930 లలో ఇలా మూడు కాలాలలో జరిగే కథ` అని చెప్పారు. 

శ్రీరామ్‌ గురించి మాట్లాడుతూ, మా కాస్టింగ్ డైరెక్టర్ కొన్ని ఆప్షన్లు ఇచ్చారు. దర్శకుడికి శ్రీరామ్ పేరు వినగానే ఆయనే కరెక్ట్ అనిపించింది. దర్శకుడికి ఒక విజన్ ఉంటుంది కదా, ఆ పాత్రకి శ్రీరామ్ గారు సరిగ్గా సరిపోతారని ఎంపిక చేశారు. మిగతా హారర్ చిత్రాలతో పోలిస్తే, ఇది భిన్నంగా ఉంటుంది. ఈ తరహాలో సినిమా రావడం ఇదే మొదటిసారి. ఈ సినిమాకి పిండం టైటిలే సరైనది. దాని చుట్టూనే కథ తిరుగుతుంది. సహజంగా ఉంటుంది చిత్రం. ప్రేక్షకులకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.

`100 కోట్లు కాదు 1000 కోట్లు ఉన్నా సినిమా చేయడం అంత తేలిక కాదు. వందల మందితో కలిసి పని చేయాల్సి ఉంటుంది. అన్నీ కలిసి రావాలి. అప్పుడే వాటంతట అవి పనులు జరుగుతుంటాయి. లేదంటే ఎన్ని కోట్ల డబ్బులున్నా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాగే షూటింగ్ సమయంలో సినీ కార్మికులను చూసి బాధ కలిగింది. తెల్లవారుజామున వచ్చి రాత్రి వరకు గొడ్డు చాకిరి చేస్తే వారికి తక్కువ డబ్బులే వస్తాయి. అయినప్పటికీ సినిమా మీద ఇష్టంతో వారి పని చేస్తుంటారు. నేను వారి జీవితాలను మార్చలేకపోవచ్చు, కానీ నాతో కలిసి పని చేసిన ప్రతి ఒక్కరినీ నా వాళ్ళగానే భావిస్తాను.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios